ఆమె
*
యే దారి గూండా ఆమె తన యింటికి వెళ్లిందో నాకది బాగా గుర్తు. ఆ దారిలో కాళ్లకింద నలిగి పడి వున్న గులాబి రేకులు వున్నాయి.*
కిందటి కాలంలో ఆమె కోసమే కదా వేచింది.ఋతువుల సంధ్యా మంటల్లో నే వేచిన క్షణాల పొద్దులన్నీ కాలిపోతున్నపుడు, స్వప్నాల దీపాల్ని నేను వెలిగించుతోన్నపుడు ఆమె రాక కోసమే కదా నేను వేచింది.*
ఆ పాట నాకు పరిచయమే. సర్వి చెట్ల కింద తన జీవితపు వేకువలో ఆమె పాడుకునే పాట నాకు బాగా గుర్తు. ఆ పాట నా కళ్లల్లోకి ప్రవాహమై పొంగిన విషయమూ నాకు బాగా గుర్తు. ఆమె తన యవ్వనంలో పాడుకునే మృత్యువు గురించిన పాట నాకు బాగా పరిచయం.
2 Comentários:
చాలా బాగుంది.
remembering olden days
Post a Comment