Tuesday, October 2, 2007

శౌ (సౌరిస్) తో ఇంటర్వ్యూ

భారతదేశానికొచ్చిన ఒక విదేశీ యాత్రికుడు శౌ(సౌరిస్) తో జరిపిన సంభాషణ ఒక ఇంగ్లీష్ పత్రికలో చూసాను.
ఈ క్రింద పూర్తి పాఠం తెలుగులో.


ఒకరోజు సౌరిస్ గారినడిగాను


'అయితే మీకు రమణ మహర్షి గారు తెలుసన్నమాట?',
'నాకు ఆయన తెలీదు. బహుశా! ఆయన గురించి యెవరికీ తెలీదేమో??..
‘నేనర్థం చేసుకోగలను మీ భావాన్ని, కాని మీరెప్పుడైనా ఆయన్ని కలిసారా?' ,
'కలిసాను, కాని నేనెప్పుడూ ఆయనతో మాట్లాడలేదు, ఆయన కూడా నాతో ! నేనక్కడికి వెళ్లి నన్ను నేను కోల్పోయాను ' ,
నేను మౌనంగా వుండిపోయాను. కాస్సేపటి తరువాత ఆమే
'అయితే అప్పుడు అడగటానికీనూ చెప్పటానికీనూ యేమీ లేదు. ఒకటి రెండుసార్లు నేను ప్రశ్నలు అడగాలనుకునేంతలో యింకొకరెవరో అడిగేవారు. ఆ విధంగా నేనడగాల్సిన అవసరం లేకపోయింది. సాధనకు సంబంధించిన సందేహాలకు ఆ విధంగా సమధానాలు దొరికేవి నాకు ' ,
'మీ నాన్నగారు కూడా మీతో వెళ్లారు కదా?' ,
' అవును, ఆయన గొప్పవారు . యోగి కాదు, కాని గొప్ప సాధకుడు. పూర్తి స్వేచ్ఛలో జీవించాడు తను అనుకున్నట్టుగా ' ,
'నాకు ఆశ్చర్యంగా వుంటుందొక్కొక్కసారి , యేమంటే జీవితపు పరమావధి ఆత్మ సాక్షాత్కారమేనా?' ,
మనం ఎప్పుడో మన ఆత్మల్ని తాకాం. అది యెంత సుళువో , తెలుసుకోవడం అంత కష్టం. ఒక పుష్పాన్ని చూసినప్పుడు అది ఎంత మామూలుగా కనబడినా, ఆ రూపాన్ని సంతరించుకోటానికి, అది ఎంత తవ్వుకొని గింజుకొని యీ మట్టిలోంచి రావాలి, యెంత అవస్థ పడితేగాని.' ,
'నాకు తెలిసి చాలా మంది యోగులు ఆత్మ సాక్షాత్కారం తరువాత అంతా ఆనందమే అంటారు. కాని నా పరిశీలనలో అది కాదేమో అనిపిస్తుంది.' ,
' ఆనందం కూడా మనస్సు లక్షణమే. మనస్సుకు ఆవలి వైపు వెళ్లండి. అప్పుడు ఆనందానికి నిర్వచనం ఏమిటి?' ,
' యోగులంటారు, మనల్ని మనం సంపూర్ణంగా అర్పించుకోవాలని అహం లేకుండా, అది వుత్త వ్యర్థ ప్రయత్నమేనని నా అభిప్రాయం. ' ,
' అయితే ఆత్మ సమర్పణ అనేది అంత సుళువు కాదు. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా అర్పించుకున్నారంటే మీరు మనస్సుకు అతీతులైనట్లే. అప్పుడింక మంచీ, చెడ్డ, ప్రయత్నం ఇలాంటివాటితో మీకు పనేమిటి? అప్పుడు కూడా మీరు మంచీ చెడ్డలు వున్నట్టుగా భావించుతున్నట్టుగానే కనబడాలి. లేకపోతే మీరు బాధపడతారు, ఇతరుల్ని కూడా బాధపెడతారు. గొప్ప నిష్టగా వుండే సాధువులకే ఈ నిజమైన ఆధ్యాత్మిక జ్ఙానం ప్రసాదించబడింది.',
' నేను ఇంకా సదేహిస్తున్నాను. ప్రతీ మనిషి తన జీవిత పరమావధి ఆత్మ సాక్షాత్కారమేనా? , మానవ ప్రయత్నంతో ఇది సాధ్యం అవుతుందంటారా?' ,
' మీరు పొరబడ్డారు. మానవ ప్రయత్నం కాదు. మనస్సే కర్మ చేత బంధించబడింది. రమణ మహర్షి గారేమంటారంటే మానవ ప్రయత్నం సంకల్పాన్ని బలీయం చేస్తుంది. మానవ ప్రయత్నామూ సంకల్పానికీ కర్మతో సంబంధం లేదు.’

2 Comentários:

వింజమూరి విజయకుమార్ said...

బావుంది. ఇటువంటివి మనిషి జీవితానికి చాలా అవసరం. వీలైతే ఎక్కువ సేకరించి మీ బ్లాగులో వుంచండి.

mohanraokotari said...

chala telusukunnanu, chelam gurinchi, motham criticism ekkada dorukuthundo cheppandi,

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO