Sunday, September 16, 2007

నువ్వే కదా?

నా కళ్లల్లో ఉధృతంగా పొంగటానికి సిద్దంగా వుంది సముద్రం...
కాని దాన్నెవరో బిగపట్టినట్టు
నువ్వే కదా?!

నేనింత దారుణంగా విలపిస్తున్నాను...
యేదో అమృత హృదయం తాలూకు నవ్వు పెనవేసుకుంది నన్ను
నువ్వే కదా?!

హఠాత్తుగా వచ్చి కౌగిలించుకుంది మృత్యువు నన్ను...
నా ప్రాణం యింకా కొట్టుకుంటూనే వుంది.
నువ్వు కాక యింకెవరూ కాలేరు!...

Seja o primeiro a comentar

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO