Thursday, September 27, 2007

అహం

'నేను నాలా గొప్పవాణ్ణనే అహం యింకా
చావని కీటకాన్ని '.
నేను అహం
అహం మానవునికి తరతరాల నించీ
యుగ యుగాల్నించీ సంక్రమిస్తూ వస్తోన్న ఆస్తి
అదింకా మిగిలి వుండటం వల్లే
మానవుడిగా నిల్చి వున్నాను..
దానివల్లనే నీ దగ్గిరకు రాలేక
నిన్ను చేరలేక వెనక్కి జరిగిపోతూ వున్నాను
నువ్వా!
నువ్వు
నాకంటే అతీతురాలివి
అన్నిటా
నాకూ
యీ ప్రపంచానికీ
అర్థం కానిదానికీ
చాతకానితనానికీ,
ఆలోచనలకూ,
అభిమానానికీ కాలానికీ అన్నింటికీ
నువ్వతీతురాలివి.

2 Comentários:

Anonymous said...

baagundhi sridhar........mari anni telisi koodaa aa ahaanni konchem pakkanapetti thana daggaraki cheracchugaaa..........ala dhooramavuthoo badhapadekante.................

Anonymous said...

it's very good

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO