నిజం చెప్పు
మనమెప్పుడూ దాని గురించి మాట్లాడనేలేదు.
మన్నించమనే నిన్నిపుడు పిలిచాను.
నిన్నిష్టపడుతూ నీ సమయాన్ని వృథా చేస్తున్నాను.
నీ కళ్లల్లో అర్ధం కాని చూపు...
మనం ప్రయత్నిస్తూ వుండాల్సింది.
యింతకు ముందు ప్రయత్నించినట్టు-మనం అదే పనిగా
అబద్దాలు చెప్పుకుంటున్నప్పుడు-
నీకు తెలుసు
ఆ చూపునెట్లాగూ మరువలేను.
అయినా
నన్నొదిలి వెళ్లటానికి నీకెంతో దూరం.
యీ మనుషులు పనికిమాలిన వాళ్లు
మనం మళ్లీ గాయపడటానికి వాళ్లకెంత ఆదుర్దా...
నిజం చెప్పు
నీకు గుర్తుందంటావా
మనకసలు సమయమే లేనంత హడావిడి జీవితాలూ...
మనకెన్నో ముఖ్యమైన వ్యవహారాలూ...
అంతకన్నా ముఖ్యమైన మాటలెన్నో మనకు .
కాని అందులో
'నువ్వూ'
'నేనూ'
యిలాంటివి లేకపోవటం విచారకరం.
యిప్పటికే ఆలస్యమైపోయింది...
3 Comentários:
adbhutam
chaalaa baavundandi! ennisaarlu chadivaano!!
Thank you friend. I am going to my teenage with your blog and its content.
with love...
Subba reddy.
Post a Comment