Saturday, November 3, 2007

ఎఱ్ఱ గులాబి

రోజు
లెఖ్ఖలేనన్ని తెల్లని పువ్వుల్తో నీ సమాధిని అలంకరిస్తాను
యింకొక ఎఱ్ఱ గులాబి తో కూడా - నీ ధైర్యానికి ప్రతీకగా
దేవదారు వృక్షాల నీడల్లోంచి మనుషులు
నడుస్తూ వెళుతున్నపుడు తప్పక ఆశ్చర్యంతో కళ్లెత్తి
నీ సమాధిపైన పువ్వులుంచి వెళతారు
లెఖ్ఖలేనన్ని తెల్లని పువ్వుల్ని,
ఒకే ఒక ఎఱ్ఱని పువ్వుని చూసి తమలో తాము
'ఆమె చనిపోయి యెన్నో రోజులయింది కదా!
యింకా ఆమె కోసం యెవరు వచ్చుంటారు?' అని ప్రశ్నించుకుంటారు.
'నీ మార్గాల గూండా,
యితరులు నిన్ను గుర్తించకుండా నువ్వెలా వెళ్లిందీ,
యీ ప్రపంచపు చిక్కుముడుల రహస్యాల గూండా
నిన్ను నువ్వెలా కోల్పోయిందీ ' అంటో తలపోసుకుంటారు.
యింకా అక్కడే నుంచుని ' నిశ్చల ధీరురాలూ ' అని నిట్టూర్చి
' మర్చిపోయిన యీ సమాధి పై
యెవరూ గుర్తించలేని వొక ధీర యువతి గాడంగా నిద్ర పోతో
వుంది వెలుగురవ్వలు సంధ్యామంటల్ని దహించేదాకా'
అనుకుంటో ...

Seja o primeiro a comentar

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO