చలం కోరింది స్త్రీ స్వేఛ్చనా? లేక స్త్రీ నా?
నలభయ్యో వడిలో పడిన చలానికి హైస్కూలు పిల్లల్లో కూడా ఏ 'అందాలు ' కనబడ్డాయో? ['..అట్లాంటి వాతావరణంలో (అందమైన హైస్కూలు అమ్మాయిలు.. ') పది జన్మల వరకు ఒక్క మాట వ్రాయలేక పోయినా దిగులుపడను.(పే.78,చలం ఉత్తరాలు ].
చలం ఎపుడూ కోరింది స్త్రీనే ! కోమటి స్త్రీలోనూ, (పే.8),హైస్కూలు పిల్లల్లో, క్రిస్టియన్ పిల్లల్లో(పే.71) అందాలు వెతికిన చలం వ్యక్తిత్వం గురించి యేం మాట్లాడదాం? మందుకీ,మగువకీ తప్ప చలం దేనికి స్పందిస్తాడు?
చలంలో కాముకుడిని వెతకడం అనవసరం. అది మానవ సహజం . అదొక ఇంస్టిక్ట్ మాత్రమే అనేవాళ్లకు చలం నిలువెల్లా కాముకత్వమేనని శరీరాన్ని సుఖపెట్టే దారుల్లోనే మార్గాలనన్వేషించుకుంటో వెళ్లాడని అంటే మింగుడుపడదు.
గాంధీ తప్ప నన్ను ఎవరూ కదిలించలేరని ఒకసారీ,
గాంధీ ఒక మంచి రాజకీయవేత్త,Tactful అనీ మరోసారీ,
నా దేశం cause మీద ప్రేమ కానీ, ప్రజలపై కాదనీ (మరి యే ప్రజలకోసం రాశాడు), అంటాడు. cause ని అంగీకరించినపుడు దానివల్ల పీడితులైన వాళ్ల బాధలు అబద్దమా?
చలంలో కాముకుడిని వెతకడం అనవసరం. అది మానవ సహజం . అదొక ఇంస్టిక్ట్ మాత్రమే అనేవాళ్లకు చలం నిలువెల్లా కాముకత్వమేనని శరీరాన్ని సుఖపెట్టే దారుల్లోనే మార్గాలనన్వేషించుకుంటో వెళ్లాడని అంటే మింగుడుపడదు.
గాంధీ తప్ప నన్ను ఎవరూ కదిలించలేరని ఒకసారీ,
గాంధీ ఒక మంచి రాజకీయవేత్త,Tactful అనీ మరోసారీ,
నా దేశం cause మీద ప్రేమ కానీ, ప్రజలపై కాదనీ (మరి యే ప్రజలకోసం రాశాడు), అంటాడు. cause ని అంగీకరించినపుడు దానివల్ల పీడితులైన వాళ్ల బాధలు అబద్దమా?
రాసిందే చేసి చూపించినవాళ్లల్లో వొకడు చలం . ఇది నిర్ద్వందంగా అంగీకరించాల్సిన విషయమే. యే మహానుభావులకో తప్ప చాతకాని విషయం . యే భావజాలాల్ని పట్టుకు వేలాడాడో అవన్నీ తర్వాత ఎట్లా యెగిరిపోయినాయి?
సరే భావాలు మారకుండా వుండాలని యేం లేదు కాలానుగుణంగా మారొచ్చు అంటే యే కాలానికి సంబంధించి చలం భావజాలాన్ని మాత్రమే తీసుకుని మిగతా వొదిలెయ్యాలి? (అన్ని కాలాల భావాజాలాలు గనక కలిపితే కలగూరగంప అవుతుందేమో)
స్త్రీ గురించి ఎంతో గౌరవంగా మాట్లాడే చలమేనా
నెల్లూరు నెరజాణల గురించి
'..The Fast ones are ugly
The Loose ones are nasty , క్రిస్టియన్ పిల్లలు తప్ప.. '(పే.71, )
అని వాపోతాడు , నెల్లూరు వొట్టిపోయిందని????
ఇది చదవకపోతే పూర్తి పాఠం MISS అయినట్టే!!
Click here to navigate
7 Comentários:
His Writings Never made any sense is what i feel
వ్యభిచరించడానికి అనుమతించని తెలుగు సమాజపు కట్టుబాట్లు చలానికి ప్రధానశత్రువు. అందుకని వాటికి వ్యతిరేకంగా ఆడవాళ్ళని ఎగసన దొయ్యడానికి కలం పట్టాడు. సెక్సు ననుభవించడంలో తల్లి కొడుక్కీ తండ్రి కూతురికీ శిక్షణివ్వాలంటాడు "స్త్రీ" లో !
చలం చచ్చేముందు మారాడు. కానీ ఏం లాభం ? జరగాల్సిన నష్టమంతా జరిగిపోయాక ? ఎక్కిరాల భరద్వాజగారు ఆయన్ని కలిసి "ఆ రోజుల్లో అలా ఎందుకు రాశారు ?" అని అడిగితే "బుద్ధి లేక రాశాను."అని సమాధానం చెప్పాడు. "మఱి ఇప్పుడు మీ రచనల్ని ఉపసంహరించుకోవచ్చు గదా ?" అని అడిగితే "అవి నా చెయ్యి దాటిపోయాయి. ఆ రోజుల్లో డబ్బు కోసం నా రచనల కాపీరైట్స్ అమ్ముకున్నాను. పబ్లిషర్సు వాటిని ఇప్పటికీ యథాతథంగా అచ్చువేస్తున్నారు. నేను మారిపోయాను మొఱ్ఱో ! అన్నా వాళ్ళు వినరు" అని వాపోయాడు.
అలాగే తాను వ్రాసిన "స్త్రీ" గుఱించి ప్రశంసాపూర్వకంగా పత్రికాసమీక్ష రాసినావిడ మీద తన "మ్యూజింగ్సు"లో విఱుచుకుపడ్డాడు.
కాని ఇప్పటి ఫెమిస్టులు ఇంకా ఆ యౌవనకాలపు చలాన్నే పట్టుకుని వ్రేలాడుతున్నారు.
చలం ని కొందరు గొప్పగా అభివర్ణించడం చూసి నేను కూడ చలం "విషాదం" చదివాను
మళ్ళీ చలం పుస్తకాలు చదవ కూడదని నిర్ణయించుకున్నాను
www.vagdevi.wordpress.com
మీరు చలం మ్యూజింగ్స్ చదివారా? Beleive me... his thoughts are far ahead of his time. ప్రపంచంలోని ఏ ఫిలాసఫర్ కంటే చలం తక్కువ కాదు.
శ్రీధర్ గారు ఇక్కడరాసినదానితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
చలం గురించి వెతుకుతుంటే మీ బ్లాగును చూశా.. ఇది కూడా చదివాను..ఈ అంశాలతో మీరు ఏకీభవిస్తారా?
http://www.telugujournal.com/ShowNews.asp?NewsID=5312&NewsType=feat
చలం గారి గూర్చి చాల చీప్ గా అర్థం చేసుకొని రాసారండి
చలం గారు అమ్మాయిలు అందంగా ఉన్నారంటే, వాళ్ళని కామించారని ఎలా అనుకొంటారు?
ఎంతమంది స్కూల్ పిల్లలని ఆయన సేడ్యుస్ చేసినట్టు మీ దగ్గర రుజువు ఉన్నదండి?
పువ్వు అందముగా ఉన్నదనుకోవటానికి నలిపి వెయ్యలనుకోవటానికి తేడా లేదా?
చలం మందు బాబు అని మీకు ఎవరు చెప్పారు? ఆయన మధువు ముట్టలేదు. మాంసం మాత్రమే తిన్నారు.
ఆయన వద్దకు వచ్చిన స్త్రీ లను , కోరిన స్త్రీలను మాత్రమే ఆయన జీవితం లోకి ఆహ్వానించారు.
ఆయన ఎప్పుడూ వ్యభిచరించ లేదు. దానిని ప్రోత్సహించ లేదు. ఆయన దృష్టిలో వ్యభిచారం అంటే 'తాళి కట్టిన భార్య తప్ప వేరే వారితో ఉండటం' కాదు. మనసు పడని, ప్రేమించని వారితో ఉండటం. అది భార్య కావచ్చు బయట వారు కావచ్చు.
sorry to say this,if you are not understanding his writing how you can say about him,and most of his writings ,they kick the hypocrasy, so the persons who live in the world of hypocrasy how they can accept his writings?what is the loss you got from chalam writings?now the chalam is not there,now you are not getting any loss?
no body can change the world, you follow what wvwr you believe and dont say this is right and this wrong how one can deside those things.
Post a Comment