Friday, November 23, 2007

ఇళయరాజా లోని తాత్వికుడు


'నేను ఈ ప్రపంచానికి అతీతుణ్ణి. నా ప్రపంచం సరిగమల నాద లోకం.

అక్కడ మానవులకి పని లేదు. మానవుడి తెలివికో ...లక్ష్యానికో ,

అక్కడ చోటులేదు. దాన్ని నువ్వు ఆస్వాదిస్తే ఎలాంటి అనుభూతి కలగదు.

మనస్సు అలాంటి స్థితిలో రాగాన్ని ఆలాపించినంత కాలం

నాదలోకంతో మమేకం చెందడం కుదరదు' .


ఒక సినీ పాత్రికేయుడికిచ్చిన ఇంటర్వ్యూలో భారతీరాజా గురించి...

'తరచూ ఫోన్ కో మాట్లాడుకుంటాం. ఎప్పుడన్నా సినిమా పూజ కార్యక్రమాల్లో కలుస్తాం. భారతి ఎప్పుడూ పాత విషయాలనే మాట్లాడుతాడు. నాకవి జ్ఙాపకం ఉంటాయి గానీ వాటి గురించి మళ్లీ మళ్లీ మాట్లాడను. ఇటీవల భారతీరాజా ఓ సినిమా పూజకొచ్చి, నేనున్నానని తెలిసి నా రూంకు వచ్చాడు. పాత విషయాలు చాలా మాట్లాడిన తర్వాత 'ఏదేమైతేనేమి.. మనమిద్దరం సినిమాలో కావలసినంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాం కదా? దాన్ని తలచుకొని గర్వపడాలి ' అన్నాడు. నేను 'ఏ విషయాన్ని అనుకుని మనం తలచుకోవాలో.. అందులో గర్వపడటానికిఏముంది చెప్పు ' అన్నాను. 'ఏమంటున్నావు ' అన్నాడు అర్థం కాక. 'బాగా గుర్తుచేసుకో... పాత ఇళయరాజా, పాత భారతీరాజాలుగా ఉన్నామా మనం? ' అన్నాను.'పాత భారతి నన్ను చూస్తే వెంటనే వచ్చి 'ఏంటయ్యా తిన్నావా? ' అని అడిగేవాడు. 'లేదు అంటే.. అరే.. ఛీ.. పో ఈ విషయాన్ని నాతో ముందే ఎందుకు చెప్పలేదు. సర్లే . రారా భోజనానికెళ్దాం. తర్వాత మాట్లాడుకుందాం. ' అనేవాడు. నేనూ అంతే . అంటే పాత ఇళయరాజా కూడా అలాగే వుండేవాడు. ఇప్పుడు అలాగున్నామా ఏమిటి? మన నిజజీవితాన్ని గురించి మర్చిపోయాం. మానసిక ఉద్వేగాలకు నీళ్లు చల్లుతున్నాం. దీని కోసం సిగ్గుతో బాధపడాల్సిన మనం దీన్ని పోగొట్టిన పేరు ప్రఖ్యాతులను అనుకుని గర్వపడటం ఎంతవరకు న్యాయం... ' అన్నాను. ఒకటి, రెండు, మూడు నిమిషాలు మా మధ్య మౌనంగానే వెళ్లాయి. ఎప్పటిలాగే భారతీరాజా, ఇళయారాజాల్లా ఎవరెవరి పనుల్ని చూసుకోవడానికి వాళ్లు వెళ్లాం.

1 Comentário:

Anonymous said...

Bagundanadi..
ee sanghatana ki sourse emitandi..?(ela telisindi ?)
Ilayaraaja gurunchi inka rayandi..

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO