Thursday, November 8, 2007

చలాన్ని యెందుకిలా చేశారు?

చలం పేరు పెట్టుకున్న ఒక కమ్యూనిటీలో చలం పై రాసిన నా ఆర్టికల్ ని (http://sridharchandupatla.blogspot.com/2007/11/blog-post_04.html) నిషేధించారు.దశాబ్దాలుగా యింత పెనుగులాడి, ఆంధ్రదేశాన్ని తన రాతల్తో చేతల్తో వూపేసి ఇన్నాళ్లకు కూడా, చలాన్ని వెలివేసిన ఆనాటి ఛాందసవాదుల్లాగా చర్చక్కూడా ఆస్కారమివ్వకుండా చలం రాతల్ని నిషేధించారు.
యెందుకిలా తయారు చేశారు చలాన్ని ? చలాన్ని దగ్గిరగా చూడమంటే ఎందుకింత బెదురు, భయం? నేను కొత్తగా రాసింది యేమీ లేదు, అన్నీ ఆయన రాతల్లోనివే! ఆనాడూ యిలాంటి భరించలేని హిపోక్రసీ మనుషుల్తో విసిగే ఆంధ్రదేశానికి దూరమయ్యాడు. ఇప్పుడు మనమే దూరం చేసుకుంటున్నాం. చలం Skirt chasing కు ముసుగూ కాదు. ఎవరికీ Fashion అసలే కాదు.


ఆయన వ్యక్తిగత జీవితమూ-ఆదర్శాలూ రెండూ వేరు కావు. వ్యక్తిత్వాన్ని తీసేసి అతని ఆదర్శాల గురించి మాట్లాడలేం. వ్యక్తిత్వంలోంచి ఆదర్శాన్ని తీసేస్తే చలం మనకి దొరకడు. చలం రాసినవి చేతలే! చేసినవి రాతలే! చలంలో అన్నీ చూడమంటున్నాను! వెతకమంటాను. ప్రశ్నించమంటాను.

చలమే స్వయంగా అంటాడు
'Think and struggle and knock and enquire. You go ahead to truth wherever you start from gross materialism or stark agnosticism. Struggle on my boy, pain. Intense pain, cry in the wilderness, seek and kick, don’t give up. Don’t sink, don’t die, keep up the torch lighted with the blood for your veins, and it will light you sure to that somewhere if there is one. If there is none, let us quietly walk out into the void to sleep(perhaps to dream), never to wake again and to suffer after the great toil of life well done.'


చదివినవే చదవకుండా ఆయన రాసినవి యితరత్రా చాలా వున్నాయి. నచ్చిన అమ్మాయితో వుండొచ్చు అంటే ఒప్పుకునీ చలంలో వాంఛ ఎక్కువనీ అంటే అది Derogatory. చలం ఆదర్శాలు నవీనమైనవి అంటే తీసుకొని, చలం స్త్రీ ని తప్ప దేన్నైనా వొదులుకోగలడంటే అది Cynical. మీడియా యింత కమర్షియలైజ్ అవకుండా , చలం విషయంలో మనమింత దురదృష్టవంతులు కాకుండా వుండివుంటే ఆయన రాసిన యితరత్రా రాతలెన్నో మనకు అందుబాటులో వుండేవి.

'బొబ్బలెట్టి అరవ - గోలపెట్టి ఏడ్వ
లీలలీలంటారు - ఎడారిఏడ్పేన
వొచ్చి చచ్చీపోవ - చచ్చిపోయూరాగ
ఇచ్చేది లేదేమి - వొచ్చేదిలేదా ? '

మనకోసం అరుపులెట్టి గోలపెట్టాడు. ఎడారి ఏడ్పు యేడ్చాడు.మృత్యువుని అతి సమీపం నుంచి చూసికూడా తొణకలేదు. చలం కొట్టిన దెబ్బలు మన విచక్షణని తాకనివ్వకండి

ఇప్పుడైనా చలాన్ని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోనిద్దాం !

11 Comentários:

వింజమూరి విజయకుమార్ said...

అదే మన వారి దౌర్భాగ్యం శ్రీధర్ గారూ. మీ ఆర్టికిల్ ని నిషేదించినా, చలం రాతల్ని నిషేదించినా కోల్పోయేది కోల్పోయింది మనమే. చలం కాదు. ఒక వ్యక్తి కేవలం తనదే అయిన ఒక స్వతంత్ర నూతన దృక్పథాన్ని ఏర్పరచుకోవాలంటే చలం మొత్తాన్ని చదవక్కర్లేదు. మ్యూజింగ్స్ లో సగ భాగం చదివి, అర్థం చేసుకోగిలితే చాలనుకుంటాను. ఏంచేద్దాం మతెంతో గతంతేనని.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

నేను చలం రచనలు సగం చదివినవాణ్ణి. చదివాక అవి చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే అనే అభిప్రాయానికి వచ్చినవాణ్ణి. ఎవరితో పడితే వారితో వ్యభిచరించమని చెప్పడానిక్కూడా శాస్త్రాలు రాయాలా ? వ్యభిచరించడమే స్వేచ్ఛాజీవితానికి ఆదర్శంగా రంగుపులిమినవాళ్ళకి బాజాలు కొట్టాలా ? చలంలో లేని తాత్త్వికుణ్ణి మనం కృత్రిమంగా సృష్టించుకోవాలా ? ఏముంది, ఆ వ్యక్తి దగ్గర నేర్చుకోవడానికి ? ఒక ఆడా, ఒక మగా వ్యభిచరించాలని నిశ్చయించుకుంటే చలాన్ని చదవనక్కఱలేదు. ఏ నాలుగ్గోడలైనా సరిపోతాయి.

Vijay said...

Hi subramanyam,


Can you show me some proof where chalam told to do prostitution with whome ever you want???

I dont think so you read chalam even half, i think you might have heard about chalam from a people like you....

Anonymous said...

విజయ్ గారూ,

వ్యభిచరించడమంటే వేశ్యకు డబ్బిచ్చి అనుభవించడమనుకుంటున్నారా ? అక్రమ సంబంధాల్ని వ్యభిచారమంటారని తెలీదా ? లేకపోతే మీ దృష్టిలో అది తప్పు కాదా ? వీర చలం అభిమానంతో ఇతరుల గుఱించి సరిగా తెలుసుకోకుండా మాట్లాడకండి. నేను చదివానో లేదో మీకెలా తెలుసు ?

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

లేదా, చలం రచనలు చదివిన ప్రతివాడూ మీలాగా చలం వీరాభిమానిగా మారిపోతాడని ఆయనగారి వ్యభిచార మతాన్ని కౌగలించుకుంటాడని ప్రగాఢంగా విశ్వసిస్తున్నారా ? ఒకవేళ అలా మారకపోతే వాడు చలం రచనలు చదివినట్లే కాదనుకుంటున్నారా ? చలానికి మనుషుల్ని మార్చేంత సీన్ లేదు. బలహీన మనస్సు గల కొంతమంది ఆడవాళ్ళ మీద అవి బాగా వర్కౌట్ అవుతాయి. మీకు తెలుసో తెలీదో, ఒకప్పుడు నచ్చిన ఆడదాన్ని వలలో వేసుకోవడానికి మగవాళ్ళు అవలంబించిన విధానం - చలం పుస్తకాల్ని బహూకరించడం.

Vijay said...

Hi subramaniam,

Ok according to you who ever has extramarital relation ship, they are doing Prostitution....

First of all the problem will come like this only...by above statement i can tell you dint read chalam...Chalam never questioned any body who is living with good values.... good values musugulo vuntu hypocratic ga vunde vallani tittadu....

Show me some proof...why you came to conclusion...otherwise tell me some book why u came to conclsion...i will explain you the real meaning...

Chalam lechi pommannadu... mariyu...ENDUKU LECHI POYINDO CHEPPADU...you have seen only first statement and understood only eloped sentence....

I am expecting from some proof from you... go through all his essays... if you find enough stuff to support your comments please let me know...

Otherwise you tell me some topic... like kamam, kopam, lobham, kavitvam, sex control, spirutialiy etc etc..you tell me i will explain to you what he told about those topics...

If you want read chalams 'vishadam' book....

dont read like novel...read carefullly...Any thing is ok for me...

vijay

, said...

సుబ్రహ్మణ్యం గారు,
అసలు చిక్కంతా ఇక్కడే వస్తుంది. వ్యభిచారానికీ శృంగారానికీ మధ్యనున్న రేఖనెప్పుడో బలహీనం చేశారు. యేం మాట్లాడినా బూతులా వినిపిస్తుంది. చలం వ్యభిచారం గురించెపుడూ మాట్లాడలేదు. అతని గొడవంతా శృంగారం గురించే. వ్యభిచారానికీ, శృంగారానికి మధ్య రేఖని చెరిపేస్తే భార్యాభర్తల మధ్య సంబంధాన్ని సాంఘిక వ్యభిచారం అనాలేమో. చలం పుస్తకాలు 'skirt chasing' కు ఉపయోగపడుతున్నాయంటే తుఛ్చమైన పనులకి చలాన్ని వాడుకునే వీళ్ల మానసిక స్థితి ఎలాంటిదో అంచనా వేయొచ్చు. శృంగారానికి మాత్రమే చలం దొరుకుతాడు.
మీ ఆరుద్ర నడగండి, కుప్పలు కుప్పలుగా కుమ్మరించేస్తాడు.
(నాకు గుర్తున్నంత వరకు రాస్తున్నాను. మొత్తం గ్రంథమే కావాలంటే చెప్పండి )
1. '..ఉభయ వక్షోజాలు వూగాడా కటి విరుగు ఇభరాజ గమనమ్ము యింక చాలును చాలు..తలుపు తెరవండి.',
2. '..చూపుల శూలాలు బాపురే! మది దొల్చ యేపైన చనులతో కాపడము నొత్తాక..',
3. '..కచభరము విచలింప కుచయుగము పచరిపంప కనక మేఖలతోడ కటి తాను నటియింప..',
4. '..నెత్తమ్ములందాడు నెమలుల చందాన నొత్తుగా పాలిండ్ల నొరసెడి నగలతో తత్తరమ్మున పసిడి తలుపు తీయండి.'.
ఇది సరిపోతుందా? వీటిని వచనంలోకి అనువదిస్తే కనీసం చదవగలమా? యింత ఘన సారస్వతం వుంది మనకు. సరే! యిది బూతు గురించి!
చలాన్ని కాస్సెఏపు పక్కన బెట్టండి.
ఎక్కడికో ఎందుకు, మన వాల్మీకినే తీసుకుందాం. ఆయన్నైతే మీరు అంగీకరిస్తారు కద. సీతాపహరణం తరువాత రాముడి విషాదయోగంలో సీత అంగాంగ వర్ణనను ఎంత పచ్చిగా వర్ణించాడో చదివారా? విషాదంలో శృంగారం , ఇది యే సాహిత్య ప్రయోగం?,యే శృంగార ప్రకోపం? యిదంతా సామాన్య ప్రజలకు ఎందుకు దాచిపెట్టారు? (మీక్కావాలంటే, ఆ సర్గలు రాస్తాను.). ధార్మికతలో బూతు కనబడదు. శృంగారం గురించి మాట్లాడితే వ్యభిచారం అంటారు. యింక ఆదర్శాల గురించా? నేతి బీరకాయలో నేతి వున్నంత చందాన వుంటుంది, మన పురాణేతిహాసాల్లో పాపం, పుణ్యం,వ్యభిచారం.

Vijay said...

good analysis sridhar,

Hi subramaiyam, you mentioned one point like chalamku manushulanu marche scene ledu ani.

if chalam , vireshalingam ,gurajada are not there our women will be doing still slavary.
Gundela meeda cheyyi vesukoni cheppu 1920 lo vunde women brathukki, ippati variki theda leda...

chalam tana rachanala dwara 'fut' mani moham pagilettu kodithe...vulikki padi...terukoni entha mandi introspect chesukoledo cheppandi...

Meeru analysis chesi cheppandi...blind ga cheppakandi...chalanni analysis cheyyalsina avasarame ledannaranukondi, inka nenu reply ivvadame manukunta...

Unknown said...

చలం గారి మైదనం చదివాను, అందులో చలం గారి ముఖ్యుద్దేశం ఏమిటో నాకు అర్థమ్ కాలేదు. చిన్నప్పుడు నుండీ చలం గారి పట్ల చాలా అభిమానం ఉండేది, కానీ మైదం లో చలం గా ఏమ్ చెప్పారో, ఎం చెప్పదలచుకున్నారో అర్థం కాలేదు ... ఈ Context లో ప్రస్తావించటం సమంజసమో కాదో తెలియదు కాన... మైదానం అంతా శ్రుంగార భరితమైన నవల అనటానికి మంచిది కాదని నా ఉద్దేశం... వివాహేతర సంభందాలను ఉద్దేశం తో రాసిన నవల ....

Unknown said...

i am totally agree with vijay,s comments

Anonymous said...

there are two things of lives, those who exist on themselves, those who exist on others.
aasa ki atyasaki jeevithamlo enta theda vundo
srungaraniki, sex ki kooda ante teda vundi
fools didnot understand, inreturn they say we dont understand

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO