Monday, November 26, 2007

ఏక కాలంలో ఇద్దరిని 100% ప్రేమించడం నిజంగా సాధ్యమా?!

ఈ అభిప్రాయం నా స్నేహితురాలిది.

' మైదానం లో రాజేశ్వరి ఒకేసారి అమీర్ ని మీరా ని సమానంగా (equal) గా ప్రేమిస్తుంది ... ఒకే time లో ఇద్దరిని 100% ప్రేమించడం అనేది నిజంగా సాధ్యమా? దానిని మీరు support చేస్తారా? నేను మాత్రం 100% support చేస్తాను... ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మీదన్నా కలగొచ్చు ఒకేసారి అనేది నేను 100% support చేస్తాను ’ .

నా మటుకు ప్రేమ , గాడానురాగం శాశ్వతం కాదని యెవరనగలరు?
అయితే జీవితంలో ప్రేమ ఒకసారి కలుగుతుందా, అనేక పర్యాయాలు కలుగుతుందా?
ఈ విషయంలో భేదాలున్నాయి . ప్రేమామృత ఝరి హృదయంలో నిరంతరమూ ప్రవహించేవారు ఎక్కువసార్లు ప్రేమించగలరు. ఏక కాలంలో ఇద్దరు వ్యక్తులను మాత్రం సమానంగా ప్రేమించడం అసంభవం. ఒకరిమీద అనురాగం సడలిపోయిన తర్వాత ఇంకొకరిమీదికి ప్రసరించవచ్చు. వొక్కరికన్నా ఎక్కువమందిని ప్రేమించటానికి ఆస్కారముండొచ్చు కానీ ఏక కాలంలో ఒకే స్థాయిలో ప్రేమించలేం. ఒక్కరు మాత్రమే Peak లో వుంటారు. priorities బట్టి మారుతుంటాయి.

ఒకే priority ఇద్దరికీ ఇవ్వలేం .
ఏ ఏ priority, ఎవరు ఉఛ్చస్థాయిలో వున్నారో
పక్కన పెట్టగలిగితే ఏమో , ఇద్దరినీ ఒకేసారి ప్రేమించగలమేమో!

మీ వోటు(పోల్) చెప్పండి( పక్కన పోలింగ్ లో).

12 Comentários:

రాధిక said...

సాధ్యం కాదు.అసలు ఒక్కరినే 100% ప్రేమించడం అన్నది సాధ్యం కాదు.ఇక ఇద్దరినా? [నా అభిప్రాయం మాత్రమే]

karyampudi said...

నా దృష్టిలో ప్రేమ అనేది ఓ అనిర్వచనీయమైన అనుభూతి దానిని ఒకేసారి ఇద్దరితో సమంగా 100% పంచుకోవడం సాధ్యమా... ! కాదేమో కదా? 100% కాదు.

Unknown said...

నాకు ఇప్పటికీ అర్థం కాని సంగతి ఇది
అసలు మైదానములో చలం గారి ఉద్దేశం నాకు అర్థమ్ కాలేదు,, కొంచం తెలిస్తే సహాయం చేయండి

Anonymous said...

దీనికి సమాధానం "ప్రేమ"కు మీరిచ్చే నిర్వచనం మీద ఆధారపడుతుంది. తల్లి తన పిల్లలందరినీ సమానంగా ప్రేమించదా? ఇక ఆడ - మగ ప్రేమ విషయంలో ఐతే ..ద్రౌపతి తన ఐదుగురు భర్తలను 'సమానంగా' ప్రేమించిందని పురాణాలు చెబుతున్నాయి కదా.
పురాణ కాలంలోనే అలా ఉంటే ప్రళయం దగ్గర పడుతున్న ఈ కలియుగాతంలో ఏదైనా సాధ్యమే. విపరీతాలు ఎక్కువైపోయాయి. మొన్ననే ఈనాడు వార్తల్లో చదవలేదా 'కూతుర్ని పెళ్ళి చేసుకున్న తండ్రి' అని. ఇలాంటివి చదివితే యుగాంతం దగ్గరపడుతున్నది నిజం అనిపిస్తుంది.

Anonymous said...

అసలు ప్రేమంటే???????????

అదొక భావన,అనుభూతి మాత్రమే అయినప్పుడు సాధ్యమవుతుంది కానీ అనురాగము, చేతలు, మాటలు అయితే మాత్రము కాదు.

krishna said...

అసలు ప్రేమంటే???????????

అదొక భావన,అనుభూతి మాత్రమే అయినప్పుడు సాధ్యమవుతుంది కానీ అనురాగము, చేతలు, మాటలు అయితే మాత్రము కాదు.

RG said...

లలితగారి అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తున్నాను. ఏకకాలంలో ఒక్కరిని ౧౦౦% ప్రేమించడం సాధ్యంకాదు. Because as they say "The first and Last love is Self-love". అసలు ప్రేమించడమంటేనే ఒక ఇగో-సాటిస్ఫాక్షన్ అని నా ఉద్దేశ్యం.
(నా ఉద్దేశ్యం మాత్రమే...)

రాధిక said...

నవీన్ గారూ ద్రౌపతి కి తన ఐదుగురు భర్తల్లో అర్జునుడు అంటే ఎక్కువ ఇష్టమని ఎక్కడో చదివాను.అలాగే తల్లిదండ్రుల ప్రేమ అందరి పిల్లలమీదా ఒకేలా వుంటుందంటే ఏకీభవించలేకపోతున్నాను.
అనోనమస్ గారూ అర్ధం కాలేదు.
rsg గారూ ఇగో సాటిస్ఫేక్షన్ ఎలా అవుతుంది?ఏ రకం గా ఆలోచించినా అర్ధం కాలేదు.

RG said...

I meant Love is nothing but satisfying each other's egos. మనల్నీ ఒకరు ఇష్టపడుతున్నారు అన్న ఇగో-సాటిస్ఫాక్షనే ప్రేమ.
sub-conscious గా Every human-emotion burns-down to plain ego అని ఒక థియరీ ఉంది.

మురళీ కృష్ణ said...

మైదానం చదువుతూ వున్నప్పుడు నాకూ ఇదే ప్రశ్నే తలెత్తింది. ఆమె అమీర్ ను ప్రేమిస్తున్నంత వరకూ చాలా అద్భుతంగా అనిపించింది. మీరా వచ్చేసరికి "ఏంటి, Story ఇలా తిరుగుతోందే? ఇది ఎంత వరకు possible? లోపల ఏదో యిబ్బంది... ఆమె యిలా చేసి వుండకూడదు అని." తరువాత, నన్ను నేను ప్రశ్నించుకున్నాను. "ఎందుకు నేనింత యిబ్బంది గా feel అయ్యాను?" అని. may be నేను(మనము) "ఒకరు ఒకరినే ప్రేమించాలి. ఒకరితోనే జీవితాంతమూనూ..." అనే constraint కు తెలియకుండానే బద్దులమయ్యామేమో. మరి ఆ ప్రేమ కు ఈ constraint ను ఆపాదించవచ్చా? ఈ constraint కు లోబడి వుండేదే ప్రేమా?

ఒకేసారి ఇద్దరిని ప్రేమించగలమా? why not? పూదోటలో అడుగిడితే ఒకే పువ్వే నచ్చుతుందా? (ఒకే పువ్వుతో స్నేహం చేయ్యాలా?) నా వరకు రోజా పువ్వు నుండి ఉమ్మెత్త పువ్వు వరకు అన్ని పూలనూ ఆస్వాదిస్తాను. దేని అందం దానిది. దేని కోమలత్వం దానిది. దేని పరిమళం దానిది. ఇంత పెద్ద ప్రపంచంలో "ఒకరినే ప్రేమించాలి. ఒకరినే పెళ్ళి చేసుకోవాలి" అనటం చాలా దారుణం. Am not married. Thinking how to break the stupid rule.

ఈ శరీరాలు, Social Constraints... ఇవన్నీ just Dramaaa. తండ్రి కొడుకు, ఫలానా ఆమె భర్త / ఫలానా ఆయన భార్య ... ఎన్ని roles అని వేయాలి? బ్రతికినంత కాలం ఈ రంగులు వేసుకునే వుండాలా? చిరాకెయ్యలే మీకు?

ఈ రంగులన్ని కడిగేసి చూస్తే మిగిలేది ప్రేమే... Unconditionality(మైదానం)... there u can Love a many.

"ఏక కాలంలో ఇద్దరు వ్యక్తులను మాత్రం సమానంగా ప్రేమించడం అసంభవం. ఒకరిమీద అనురాగం సడలిపోయిన తర్వాత ఇంకొకరిమీదికి ప్రసరించవచ్చు. వొక్కరికన్నా ఎక్కువమందిని ప్రేమించటానికి ఆస్కారముండొచ్చు కానీ ఏక కాలంలో ఒకే స్థాయిలో ప్రేమించలేం. " ఈవిధంగా transfer చెయ్యటానికి యిదేమైనా PF accountaaa అండీ! "ఒక్కరు మాత్రమే Peak లో వుంటారు." ఈ line గీసిందెవరు? ఎందుకిలా రాసుకున్నారు?


ఏమిటో ఆ కాలంలో మాధవుడు అంతమంది గోపికలకు సమానంగా ప్రేమను పంచాడు. వాళ్ళెవరూ, క్రిష్ణుణ్ణి తనకే కావాలని పట్టు పట్టలేదు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ (priority) అని అనుకోలేదు... ఈ కాలంలో ఎందుకో ఇలా!!!

బొత్తిగా లోకజ్ఞానం లేనివాణ్ణి. ఏదో అలా అనిపించి యిలా రాశాను. మీ మనసు నొప్పించివుంటే ప్రేమతో మందలించగలరు... నమస్సులతో...

Anonymous said...

well said Murali Krisha garu.
As far as Rajeswari is concerned, her love is as pure as that of Lord Krishna's. So only she could understand Amir's love for other Woman.
For her living with out Love or Passion is like death which she ran away from.
But it is a different story that Amir is not as matured as Rajeswari. the novel also warns about the possible consequences that can arise.
It is not Love that is cause of these problems. It is jealousy.

ashok said...

దీనికి సమాధానం "ప్రేమ"కు మీరిచ్చే నిర్వచనం మీద ఆధారపడుతుంది. తల్లి తన పిల్లలందరినీ సమానంగా ప్రేమించదా? ఇక ఆడ - మగ ప్రేమ విషయంలో ఐతే

kudaradu

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO