మృత్యువు
నదిలా ప్రవహిస్తోంది జీవితం
పడవ సరంగు తీరం కోసం వెతుకుతున్నాడు
తీరం కనిపించని సముద్రం
ముడి విప్పలేని చిక్కులా వుంది
యెవరి కోసమో యీ జగతి
అంతులేని నిరీక్షణ సల్పుతోంది
పడవ సరంగు కళ్లలో
తీరం కనిపిస్తుందనే ఆశ
అలసిపోయినా సరే
యేదో వొక రోజు
నిన్ను తప్పించుకోగలననే
అత్యాశ.
Post a Comment