Wednesday, December 26, 2007

ITR2 and 1 - Easiest way to fill - Excel File to download

పోయినేడాది ITR2 (Income Tax Return) ఫారం పూర్తి చేసేటప్పుడు పడిన కష్టాలు ఎలా వుంటాయో అవి పూర్తి చేసిన వాళ్లనడిగితే వారి తిప్పలన్నీ ఏకరువు పెడతారు. ITR2 ఫారమే అసలు గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఏమీ అర్థం కాకుండా దేనికీ పొంతన లేకుండా తికమకగా (తిక్కతిక్కగా) వుంటుంది. అందుకనే ఆ తలనెప్పుల్ని భరించలేకే వందో రెండువందలో బ్రోకరుకి సమర్పించుకుని చేతులు దులిపేసుకున్నవారు చాలా మంది వున్నారు.

గూగిల్ సెర్చిలో ITR2 filling అని Instructions అని , యింకా యెలా గూగిల్లినా పుట్టగొడుగుల్లా మనముందు కనబడే వేల సైట్లలో ఏదీ మనకుపయోగపడేట్టు కనబడవు. ఒకరోజు అనుకోకుండా ఇంగ్లీషు బ్లాగరు పుణ్యమాని యీ ఎక్సెల్ ఫైల్ కనబడి తెరచి చూస్తే ITR నింపటం యింత సులువా అని ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. నా Tentative ITని యీ ITR2 లో పెట్టటానికి నాలుగు నిమిషాలకంటే ఎక్కువ పట్టలేదు. యీ ఎక్సెల్ ఫైల్ ఒక ప్రోగ్రాం లా రన్ అవుతుంది. మన దగ్గిరున్న Form-16 లో కొద్ది డేటా దాంట్లో డేటా షీట్ లో ఎంటర్ చేస్తే సెకెండ్లలో మన ITR(సుమారు పది పేజీల) మీ ముందు రెడీ ప్రింటబుల్ వర్షన్ లో.


ITR2 ని ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోండి.
http://www.sharelor.com/v/7282373/itr2.xls.html

ITR1 ని ఇక్కడ.
http://www.sharelor.com/v/4007812/itr1.xls.html




Report Bad Link to: dearsridhar@gmail.com

Seja o primeiro a comentar

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO