Monday, December 10, 2007

రామాయణంలో అసలు కథ(?)

రామాయణంలో పిడకలవేట నాకిష్టం లేదు.ఇది రామాయణానికి రాయబోయే వ్యాఖ్యానాల్లాంటి మహత్తర కార్యం అసలే కాదు. కాని చాలాసార్లు నాలో కొన్ని ప్రశ్నలు ఉదయించాయి.

1. రామాయణం వొక్కటే అయితే(వాల్మీకి), మన దేశంలో (లేక ప్రపంచం మొత్తం మీద అందామా?) యిన్ని రామాయణాలు ఎందుకు ప్రాచుర్యంలోకొచ్చాయి?

2. సరే వొచ్చాయి, వాల్మీకి రామాయణానికీ(మూలం ఇదే అనుకుంటే) , తర్వాత కోకొల్లలుగా వొచ్చిన రామాయణాలకి చాలా వాటిల్లో పోలికలెందుకు కనిపించలేదు?ఎవరు మార్చారు?ఎందుకు మార్చారు?

3. హైందవ సంస్కృతి చాలా బలీయమైంది. కనుకనే వేల సంవత్సరాలుగా మన జీవితాలు దీనితో పెనవేసుకుపోయాయి. దీని కూకటి వేళ్లు అంత శక్తివంతమైనవి. అది హైందవ సంస్కృతి గొప్పదనమా లేక మన మనస్సుల్లో మనం కట్టుకున్న గొప్ప నమ్మకమా?

4.వాల్మీకి రాసిన చాలా విషయాల్ని మన వాళ్లెందుకు దాచి పెట్టారు. అన్నిటినీ కూలంకషంగా ఎందుకు చర్చించలేదు?హైందవ సంస్కృతి పరిరక్షణకా లేక సంఘ నీతిని కాపాడటానికా?

'రామాయణంలో అభ్యంతరాలుగా వున్న అన్ని విషయాల్ని ప్రస్తావించనఖ్కరలేదు , కానీ మన నమ్మకాల్ని సడలింపజేయనివీ అయితే చర్చిద్దాం ' అని అంటారా?

ఈ పేజీలో(ఎడమ వైపు) పోల్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి.

1 Comentário:

Apparao said...

రామాయణము అనేది కొన్ని లక్షల సంవత్సరాల క్రితము జరిగినది. నిన్న జరిగిన సం ఘ టనకు పలు పత్రికలూ విభిన్న రకాలుగా రాస్తారు కదా మరి. రామాయణము ని అనేక మంది అనేక విధాలు గా రాయటములో తప్పులేదు. గాంధీ గారి గురించి నేను ఒక రకము గా రాస్తాను మీరు ఒక విధముగా రాస్తారు. ఇందులోనే సమాధానము వుంది.

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO