Wednesday, December 5, 2007

యిదంతా?!

ఒళ్లంతా మోహనరాగాలేవో
అల్లుకుంటోన్న అలికిడి
నిశీధి ప్రాంగణంలో సంధ్యారాగాలేవో
కరిగిపోతోన్న కలకలం

-యిది కవిత్వమేనా?

వూబిలా నన్ను లాక్కునేది?
ప్రవాహాలేవో నన్ను చుట్టేస్తో వురకలెత్తుతున్నాయ్
శ్వాస సుగంధమై ప్రాణం పరిమళమవుతోంది
వ్యాకులతా పుష్పాలన్నీ
వొక్కొక్కటీ రాలుతోన్న చప్పుళ్లు
చీకట్లోని అగాధంలా యేదో
అనంతాన్ని సూచిస్తోంది
నిశ్చబ్దం శబ్దమవుతోన్న వేళ

-యిది
ఆనందం
అలౌకికం
విశ్వజనీనం

కవిత్వమేనా యిదంతా?!

Seja o primeiro a comentar

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO