Sunday, January 13, 2008

తెలుగు భారతీయుడు-'ఒక్క మగాడు' (సారీ! ఇది హార్ట్ పేషెంట్లకు నిషిద్దం)

(ఇది ఎవరినీ నొప్పించే ఉద్దేశంతో రాసింది కాదు)

వీకెండ్ కదాని వీలుచూసుకుని అలాగే మర్చిపోకుండా ధైర్యాన్ని తోడు తీసుకుని 'ఒక్క మగాడు!' కు వెళ్లాను.
హాల్లో పవర్ పోగానే పవర్ ఫుల్లు డైలాగుల్తో ఎప్పటిలానే బాలయ్య ఎంట్రీ ఇచ్చాడు. ఒక ఫైటూ, సాంగూ వేసుకున్నాడు. నిషాకొఠారీతో సరసాలూ, గుండె దడదడలాడే డైలాగుల్తో మాంచి రసంలో సాసాగుతోంది మూవీ.

ఇంతలో ఉలిక్కిపడ్డాను.

నేను వచ్చింది కమల్ భారతీయుడి (క.భా) సినిమాకా లేక బాలయ్య భారతీయుడి (బా.భా) సినిమాకా?
మీ అనుమానం నిజమే. క.భా డి డిటో మేకప్ తో బా.భా . సిపాయి కోటు,తోలు బెల్టు, అదే క్రాఫు . చీకట్లో స్మశానానికొచ్చాడు. క.భా చిన్న బాకు లాంటి కత్తి తీస్తే బా.భా సమాధి చేసుకున్న పెట్టెలోంచి పొడవాటి షాంగై ఖడ్గాన్ని తవ్వి చేతిలోకి తీసుకుంటాడు. దానిమీద వంకరటికరగా చెక్కివున్న యేవో చైనా అక్షరాలని అయోమయంగా చూసి ఎదురుపడ్డ ప్రత్యర్థుల్ని నాలుగే సెకెండ్లలోనే మట్టి కరిపించి చీకట్లో మాయమైపోతాడు. ఇదీ బా.భా ఇంట్రడక్షన్ . ముందు ముందు ఇంకా యేం చూడాల్సి వస్తుందేమోనని భయమేసి అటూఇటూ చూసుకున్నాను. నాలాగానే , అక్కడక్కడ కూర్చున్న ఇంకొందరు మొఖాలు చూసుకుంటున్నారు. నేను గబుక్కున లేచి డోర్ దగ్గిరకెళ్లి లాగాను. అది బయటినుంచి బోల్టు వేసుంది. హాల్లో ఇంకోవైపున్న డోర్ దగ్గిర ఎవరో తలుపుని గట్టిగా లాగుతున్నాడు. కాల్స్ చేసుకోటానికి సెల్ రెడీగానే వుందని కన్ ఫర్మ్ చేసుకుని కుర్చీలో కూలబడ్డాను.

ఇక అప్పుడు మొదలైంది అసలు సందడి. జూనియర్ బాలయ్యతో బా.భా
'మంటల్లో మనుషులు కాలిపోతుంటే వాళ్లని కాపాడటానికి నువ్వు ప్రయత్నిస్తావు. నేను మంటల్నే మింగేస్తానురా.' , '...మంచివాళ్లకి మంచివాణ్ణి మోసగాళ్లకి వైరస్ ని ' అని మధ్యమధ్యలో బా.భా జడిపిస్తున్నాడు. ముసలి సుకన్య (సారీ! ఇక్కడ సిమ్రాన్ ఆ సీటు భర్తీ చేసింది) బా.భా గురించి ఉపన్యాసం మొదలెడుతో 'మీకు గాంధీ తెలుసు, చాచా నెహౄ తెలుసు, సుభాష్ చంద్రబోసు తెలుసు, కాని వీళ్లందరికీ 'ఒక్క మగాడు ' తెలుసు’ అని గట్టిగా రంకె వేయగానే దిగ్గున కుర్చీలోంచి పడబోయి తమాయించుకుని కాదు తల పట్టుకున్నాను వెర్రి చూపులు చూస్తో బ్రహ్మానందం స్టైల్లో 'బాబోయ్! ఇదెక్కడి గోలరా నాయనా!'’ . సెకెండ్ హాఫ్ మొత్తం బాలయ్య సెకెండ్ ఇన్నింగ్స్ తో బ్రిటిషోల్తో సహా మనల్ని కూడా , హెడెన్ ఆడుకున్నట్టుగా వీరబాదుతాడు. మనం కోలుకునేసరికి బాలయ్య తిరిగి హ.హ.హ.హ. (హకి హకి మధ్యలో అరసెకండు గ్యాప్ తో) భయంకరంగా నవ్వుతో బా.భా లో ప్రవేశిస్తాడు.

అయితే క.భా కి బ.భా కి కొన్ని పోలికలు కనిపిస్తాయి, కాకపోతే బ.భా చాలా పవర్ఫుల్.
1. క.భా కి చిన్న కత్తి, బ.భా కి పొడవాటి షాంగై ఖడ్గం .
2. క.భా కి అదేదో చేతి వేళ్లతో పొడిచే విద్య వచ్చు. బ.భా కి చాలా వచ్చు, వేళ్లతో పొడిచేది, కత్తిసాము,షాంగై వీరుల్లాగా గాల్లోకి ఎగరడమూ, వాయుబంధనం వగైరా వగైరా
3. క.భా కి క్రాఫు చెదిరితే సర్దుకుంటాడు, బ.భా కి అసలు క్రాఫు చెదరదు, ఇంకెక్కడ సర్దుకుంటాడు .
4.క.భా వొళ్లంతా వృధ్ధ్యాపం, బ.భా కి ముఖంలో మాత్రమే .
5. సుకన్య-సిమ్రాన్ సేం టు షేం డిటో.
6. బ.భా కి ఇంకో ఎగస్ట్రా విద్య కూడా వచ్చు, కంటి చూపుతో బుల్లెట్ వేగాన్ని చూసి తప్పుకోడం.
7.క.భా టెర్రరిస్టు, బా.భా టెర్రరిస్టు .
8. సుభాష్ తో క.భా కనిపిస్తాడు, బ.భా గురించి మన జాతీయ నాయకులంతా మాట్లాడతారు.
8. చివర్లో ఫ్లైట్ క్లాష్ లో క.భా అదృశ్యం, తిరిగి ఎక్కడో సింగపూర్లో ప్రత్యక్షం. బా.భా కి కూడా ఫ్లైట్ క్లాష్ , మళ్లీ అరకులోయ కొండల్లో ప్రత్యక్షం.

అపరిచితుడి లోని మార్షల్ ఫైట్ ని మాత్రం ఎందుకు వొదలాలని ఇక్కడ క్లైమాక్స్ లో 50 మంది చైనా షాంగై వీరుల్తో బా.భా మార్షల్ ఫైట్ విన్యాసాలు (పాపమా 50 మంది వీరులు బా.భా 10 సెకెండ్ల పాటు అరిచే వొకే కేకకి బెదిరిపోయి గాల్లో గింగుర్లు కొడతారు (నేను కూడా నా సీట్లో గింగుర్లు కొడుతున్నాను ఎప్పుడు డోర్ తీస్తారా అని).

'దంపుడు బియ్యం తిన్న బాడీరా ఇది!
వయసు 1 !
పేరు 'ఒక్క మగాడు'!'

ఇక తయారుగా వుండండి,
ఈ తెలుగు షాంఘై వీరుణ్ణి(సారీ! బాలయ్య భారతీయుడు) చూడటానికి .

అన్నట్టు చెప్పడం మరిచారు.
ఈ బా.భా స్టిల్సు పోస్టర్లపైన ఎక్కడా లేవు. బహుశా జనాలు దడుసుకుంటారేమోనని వేయలేదేమో!

11 Comentários:

karyampudi said...

నిన్ననే మెయిల్ వచ్చింది ఈ సినిమా గురించి యల్ ఐ సీ పబ్లిక్ నోటీస్ .
-----------------------------
Dear Policyholders,

With the help of our past experiences and keeping in view the interests of our beloved policyholders, please be informed of the below announcement: We will not pay money for policy holders those who die after watching the

movie ‘ Okka Magadu ' starring Nandamuri bala krishna. As per the new rules, this comes under ‘SUICIDE’ category, which is not eligible

for payments. We deeply regret the sorrowful deaths of those who dared to watch this movie and extend our condolences to the bereaved families. May their.

Regards, souls rest in peace. Amen

Life Insurance Corporation of India.

"Jeevan ke saath bhi .... Jeevan ke baad bhi"
--------------------------

మీ పోస్టు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.
బాగా రాసారు.

Anonymous said...

కానీ నాకెందుకో బాలయ్య పంకాల పాలిటి వరప్రసాదంలా అనిపిస్తోంది మీ వర్ణన విన్నాక. వంద రోజులు ఆడకపోతే నిర్మాత చస్తాడు కాబట్టి నూరు రోజులు ఓ సమస్య కాదు, సమస్యల్లా ఎన్ని నూరు రోజులాడి జనాల్ని రంపపుకోతకు గురిచేస్తాడో అన్నదే :-)

Naga said...

వామ్మోవ్...వాయ్యోవ్...

Unknown said...

అహహహ....అహహహ...ఒహొహొహొ.....
ఏం రాసారండీ. బాలయ్య తొడగొట్టడాన్ని కూడా మించిపోయారు :)

pi said...

HIlarious!!! May I should call doc for the stomach ache this post caused. Nenu Balayya cinemaala joliki ponu.

Unknown said...

మీరిలా అంటున్నారు కానీ, మా ఫ్రెండ్స్ అంతా ఈ కామెడీ సినిమా చూడటానికి ముందుగానే టికెట్లు తీసిపెట్టెకున్నారు. :) సినిమా చూసి, నవ్వీ నవ్వీ కడుపు నొప్పి పుట్టింది.. :)

కార్తీక్ పవన్‌ గాదె said...

మొదటిరోజు మిత్రుడు టిక్కెట్ తెచ్చాడు. మార్నింగ్ షో సగంలోనే ఒక బ్లాగ్మిత్రుడు బయటికొచ్చి విషయాలన్నీ చెప్పేసరికి గింగిరాలు తిరిగా..అసలు అందుకే ఈ పిచ్చి గోల మనకెందుకురా అని సినిమాకి వెళదామనుకొని కూడా వెళ్లలా.. హమ్మయ్య.. మంచి పని చేశానేమో..

- కార్తీక్పవన్‌

బ్లాగాగ్ని said...

నేను బాలయ్య సినిమాలని కామెడీ సినిమా అనే దృష్టితో చూస్తాను. ఆరకంగా ఈ సినిమా నిస్సందేహంగా అల్లరిపిడుగు, మహారధి వగైరాలను మించిన కామెడీ. రెండున్నర గంటలు నవ్వుకోడానికి మంచి కాలక్షేపం. మీరు కూడా మిస్సవ్వద్దు, 'ఓక్-క మగాడు'. నేడే చూడండి.

Naga Pochiraju said...

అసలు మీకు సాహస రత్న ఇవ్వాలండి
అసలు ఆ సినిమాకి ఎలా వెళ్ళారండి?
ఉచితం గా టికెట్టు ఇచ్చరా?
నాకు ఆ మొవిఎ గురించి విన్నవెంటనే తెగ నవ్వొచింది
ఇక చూసిన వారి పరిస్థితి అర్ధం చేసుకోగలను

aswin budaraju said...

బ్లాగాగ్ని గారు మీరు పల్నాటి బ్రహ్మనాయుడిని మరచిపోయారే ....
ఎందుకంటే నాదీనూ మీపాలసీలేండీ :-)

Anonymous said...

abbooooooooooo super cinema basu

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO