Thursday, December 20, 2007

ఈ సందేహాలెవరన్నా తీర్చగలరా?

మన సారస్వత/సాంస్కృతిక సంపద యెంత గొప్పదో ప్రపంచ ప్రాచీన జాతులన్నిటికీ బాగా తెలుసు! భాగవతం,రామాయణం,భారతం,పురాణాలు,ఇతిహాసాలూ...


యీ పై రెండు వాక్యాలు రాయటానికి కొద్దిగా కష్టపడాల్సి వచ్చిందనే చెప్పాలి, యేవి పురాణాలో, యేవి ఇతిహాసాలో కొద్దిగా కన్ ఫ్యూషన్. నా విన్నపం ఏంటంటే ఈ క్రింద అడిగిన వాటికి క్లుప్తంగా నా సందేహాలు ఎవరైనా తీర్చగలరా?

1. స్థూలంగా మన సారస్వతాన్ని ఎలా విభజిస్తాం.

2. పురాణాలు, ఇతిహాసాలు యిలా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు, ఏవేవి దేంట్లో ఎన్ని వుంటాయి.

3. అసలు పురాణానికి, ఇతిహాసానికి ఎత్చ్. స్పష్టమైన భేదాలు, అర్థాలు వున్నాయా?

4. సారస్వతంలో జానపదాలు భాగమా ?

4 Comentários:

కొత్త పాళీ said...

నిర్వచనాలు స్పష్టంగానే ఉన్నాయి, కానీ నాకు ఇంకోరికి వివరించేంత తెలియదు. నాకు తెలిసింది ఇది.
వాల్మీకి రామాయణం = కావ్యం = సృజనాత్మక కవిత్వానికి ప్రాముఖ్యత ఎక్కువ
వ్యాస భారతం = ఇతిహాసం = ఎప్పుడో జరిగిన విషయాల గురించి సమాజంలో ఉన్న గాథల్ని ఏరి కూర్చిన గ్రంథం = జన జీవన విషయాలకీ ధర్మ బోధకీ ప్రాముఖ్యత
మహాభాగవత్ము, ఇతర అష్టాదశ పురాణాలు = పురాణములు = భగవల్లీలలు చెప్పే గాథలు. భగవల్లీలకే ప్రాముఖ్యత.

వింజమూరి విజయకుమార్ said...

1. సారస్వతాన్ని ఎన్ని రకాలుగానైనా విభజించుకోవచ్చు. అది విభజించేవారి ఓపికని బట్టి వుంటుంది.2.ఇతిహాసాలంటే రామాయణ, భారతాలను ఇతిహాసాలంటాలు. ఇవి క్రీ.శ. 300 లోనివిగా భావించబడుతున్నాయి. పురాణాలు కోకొల్లలు. వీటినీ వారి వారి యిష్టాల కనుగుణంగా విభజించుకోవచ్చు. 3. పురాణాలకి, ఇతిహాసాలకి భేదాలు నా దృష్టిలో లేవు. అవన్నీ తెలివైన రచయితలు రాసినవిగానే భావిస్తా. మిగతా ఎవరి విశ్వాసాలు వారివి. 4. సారస్వతంలో జానపదాలు ఖచ్చితంగా భాగమే. అవే కాదు తెలుగువారు మంచి ఏది రాసినా అది తెలుగు సారస్వతంలో భాగమే. సరేనా?

, said...

కొత్తపాళీగారికి, విజయకుమార్ గారికి నా కృతజ్ఙతలు, ఇది వరకున్న సందిగ్దత ఇప్పుడు కొద్దిగా తగ్గింది.

Anonymous said...

i dont have telugu typing software. I request you to transalate into telugu.
Puranas are 18. Astadasa puranalu.
the list is available in many websites. (ex: Matsyapurana, brahmapurna, markandeya purana, kurma purana, varahapurana, brahma vaivarthana purana etc.)
itihasas are Ramayana and mahabharatha (these will have a moral story, giving lot of importance to geographical, historical, social, moral details and descriptions. They are simplifications of essenials of puranas and vedas(!), otherwise can be compared with epics. (in those days many were able to undersatand this and explain to the common people (entertainment!). The themes diluted to janapadas.
Kavyaa can be itihasa or any stories witten in gramatical (poetical) way. (there is a lot more about kavyas and even puranas and ithihasas. Those who want to know about these can sincerely try. this is not difficult to understand.
Janpadas are part of sahitya. Sahitya is simply literature.
Ramachanra murthy

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO