Saturday, October 20, 2007

కాంక్ష

నాకు నిద్ర ముంచుకొస్తోంది
చలనం లేని అనార్కలీ పాదాల చెంత
మేల్కోవాలని ఆశించి ఆమె పాదాలను
తాకాలన్న బలమైన కాంక్షతో
తపించిపోయిన సలీంలా...

నాకు మత్తులాంటి నిద్ర ముంచుకొస్తోంది
జూలియట్ నవ్వుకోసం
స్వప్నంలోంచి మేల్కాంచాలని తపించి
దుఃఖసముద్రంలో కొట్టుకుపోయిన రోమియోలా ...

నాకు మృత్యువు లాంటి నిద్ర ముంచుకొస్తోంది
కొన్ని యుగాల తరువాతయినా
ఆమెలో ప్రేమల్ని రగిల్చాలన్న బలమైన కాంక్ష నన్ను గెలిచి...

నాకు మృత్యువు లాంటి నిద్ర ముంచుకొస్తోంది.

Seja o primeiro a comentar

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO