ఆహ్వానం!
మా సౌందర్యలోకాలకి నిన్ను ఆహ్వానించినపుడు నువ్వెందుకంత కలవరపడ్డావు-
మా పక్షులు నీకు తోవ చూపుతాయి.
మా తోటలోని పువ్వులు సంతోషంగా తలలూపుతాయి.
మా సరస్సులు నీ పాదాల్ని కడిగి నిన్ను వెచ్చగా చుట్టుముడతాయి.
మా తోటలు నీకు పరిమళాలు పంచుతాయి.
మా పాటలు నిన్ను సేద తీరుస్తాయి.
మా నక్షత్రాలు అలుపు తెలీకుండా నీకు రహస్యాలు చెబుతాయి .
మేం నిజాయితీగా ప్రేమించగలమనటానికి నిదర్శనం
మా హృదయాలపై అనంతమైన గాయాలు...
Seja o primeiro a comentar
Post a Comment