Thursday, April 2, 2009

వోవర్ నైట్లో రా(తే)జ వారు ఫాప్యులర్ అయిన విధంబెట్టిదనిన ...

clip_image002

తేజ (చిత్రం డైరెక్టర్ ) మాటల్లోనే ( సాక్షి పేపరుకిచ్చిన ఇంటర్వ్యూ నుంచి )

చెన్నైలోనే పుట్టి పెరిగాను. నాకు ఒక అక్క. చెల్లి. మూడేళ్ళ వయసులోనే అమ్మ పోయింది. ఆవిడెలా ఉండేదో కూడా గుర్తులేదు. ఎనిమిదేళ్ళ వయసులో నాన్న పోయారు. తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోయేసరికి మా ముగ్గురినీ ముగ్గురు చుట్టాలు పంచుకున్నారు. నన్ను పెంచుకుంటున్న వాళ్ళు బయట పడుకోమన్నారనే రోషంతో నేను బయటకొచ్చేశాను. ఒక లారీ డ్రైవర్ దగ్గరకెళ్ళి, 'అమ్మా వాళ్ళు బస్సులో వెళ్ళిపోయారు, నేను మిస్సయ్యాను ' అని ఒక అబద్దపు కథ చెప్పి విజయవాడలో దించమని అడిగాను.

అక్కడకెళ్ళి పెదనాన్న కలవగానే ఆయన 'ఏదయినా ప్రాబ్లం ఉంటే రమ్మని మాటవరసకు అంటే నిజంగా వచ్చేయడమే!'అని అనగానే వెంటనే అదే లారీ డ్రైవర్ దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్ళి 'తప్పైపోయింది... నీతో అబద్దం ఆడాను. నన్ను మళ్ళీ చెన్నై తీసుకెళ్ళి, నాకో ఉద్యోగం ఇవ్వవా?' అని అడిగాను. అప్పుడతను నన్ను లారీ క్లీనర్ గా తీసుకున్నాడు. తర్వాత కొన్నాళ్ళకి ఉదిపి హోటల్ లో పొద్దున 04.30 నుంచి 8 గంటల దాకా ఇడ్లీలు తీసే జాబ్ చేసేవాడిని. తర్వాత అవే ఇడ్లీలు ప్రొడక్షన్ వ్యాన్ లో ఎవిఎం స్టూడియోకి తీసుకెళ్ళేవాడిని. మధ్యాహ్నం నుంచి అక్కడే ఫ్లోర్ క్లీనర్ గా కూడా చేసేవాడిని..

నిజంగా తేజాది చాలా దీన గాధ. పాపమనిపించింది


ఫ్లోర్ క్లీనర్ నుంచి మెల్లిమెల్లిగా కెమెరా డిపార్ట్ మెంట్ లో జాయినయ్యి దాదాపు 120 సినిమాలు, 10 టీవీ సీరియల్స్ చేశాను. ఆ తర్వాత ఓ 12 సినిమాలకి అసిస్టెంట్ కెమెరామన్ గా కూడా పనిచేశాను. ఆ టైంలోనే అందరినీ కూర్చోబెట్టి కథలు చెప్పేవాడిని.

అది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గమనించాడు.

ఉన్నట్టుండి ఓ రోజు నన్ను పిలిచి 'నేను ఒక సినిమాకి డైరెక్టర్ ని కాబోతున్నాను.షూటింగ్ హైదరాబాద్ లో చేయాలనుకుంటున్నాను. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా?' అని అడిగాడు. 'సరే' అని నెలజీతం మీద హైదరాబాద్ వచ్చి ఆ సినిమాకి అతనికి స్క్రిప్ట్ లో హెల్ప్ చేశాను.

ఆ సినిమా సూపర్ హిట్! ఆ సినిమా పేరే 'శివ’, ఆ దర్శకుడే 'రాం గోపాల్ వర్మ’! కొన్నాళ్ళ తర్వాత రాము నాకు 'రాత్రి ' సినిమాకి మెకెరామన్ గా బ్రేక్ ఇచ్చాడు. ఆ సినిమా ఆమిర్ ఖాన్ (యీయన బాలీవుడ్ ఫేమస్ యాక్టరే కదా ) చూసి, నా కెమరా వర్క్ నచ్చి, నన్ను పిలిచి - 'నువ్వు ఒక్క కెమెరా వర్క్ లోనే కాక స్క్రిప్ట్, డైరెక్షన్ లో కూడా ఇన్ వాల్వ్ అవుతావని విన్నాను. నాకో ఫ్రెండ్ ఉన్నాడు. అతను మొదటి సారి సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. నువ్వు అతనికి హెల్ప్ చేయాలి ' అన్నాడు. ఆ డైరెక్టర్ పేరు అశుతోష్ గోవరికర్, సినిమా పేరు 'బాజి ' ( లగాన్, స్వదేశ్ దర్శకుడు ) . ఆ సినిమాకి 2-3 ట్రక్కులు వాడి తీసే షాట్ ని నేను, రెండు టార్చ్ లైట్లతో తీశాను. ఆ విషయం పొద్దుటికల్లా బాంబే అంతా స్ప్రెడ్ అయిపోయింది !నైట్ అంతా షూట్ చేసి పొద్దున లేచేసరికి రూంబయట 7-8 మంది ప్రొడ్యూసర్లు (బాలీవుడ్డు ప్రోడ్యూసర్లే ?! ) వెయిటింగ్. అలా మొదలింది నా కెరీర్.

ఇప్పుడు రాజావారిని ( అయ్యో సారీ, తేజావారిని ) చూస్తే నిజ్జంగా పాపమనిపిస్తోందా?


This article in pdf can be downloaded from here


3 Comentários:

asha said...

నిజ్జం.
చాలా బాధనిపిస్తుంది.

Anonymous said...

అందుకేనేమో విచిత్రం సినిమా లో హీరొని లారీ క్లీనర్ గా చూపించాడు

Anonymous said...

Nijam (it's a lie...)

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO