Wednesday, July 1, 2009

మైఖేల్ జాక్సన్ ని కదిలించిన ఠాగూర్ కవిత్వం...













మైఖేల్ తన జీవిత చరమాంకంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వాన్ని చదివారు. కొన్నేళ్ల కిందట... రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రసిద్ద రచన 'పోస్టాఫీస్ ' చదివిన మైఖేల్ ఎంతగానో చలించిపోయారు. ఠాగూర్ ఇంకా బతికే ఉన్నారనుకుని భారత్ కు రహస్యంగా వచ్చి శాంతినికేతన్ చేరుకున్నారు. ఠాగూర్ చనిపోయి దశాబ్దాలు దాటిందని తెలుసుకుని తీవ్ర నిరాశతో తిరిగి వెళ్లారు.


1996 లో ముంబైలో ప్రదర్శనలు ఇచ్చినప్పుడు భారత్ పై తనకున్న ప్రేమానురాగాలను మైఖేల్ భావోద్వేగభరితంగా వ్యక్తం చేశారు. ముంబై నుంచి వెళ్లిపోతూ తన దిండు కవరుపై ఇలా రాశారు.

'భారత్ ! నిన్ను చూడ్డానికి యీ జీవితమంతా వేచి ఉన్నా. నిన్ను, నీ ప్రజలను కలుసుకున్నా, నీ ప్రేమలో పడిపోయా. నిన్ను విడిచి వెళ్లిపోతున్న యీ సమయంలో నా గుండె వేదన, నిరాశతో నిండిపోయింది. భారత్... నేను మళ్లీ నీ దగ్గరకు వస్తానని, నిన్ను ప్రేమతో ఆలింగనం చేసుకుంటానని హామీ ఇస్తున్నా. నీ దయాగుణం, ఆధ్యాత్మిక చైతన్యం నన్ను కదిలించాయి. నీ ప్రజలు నా హృదయాన్ని తాకారు. వాళ్లు దేవుడి ప్రతిరూపాలు. నేను నిన్ను గాఢంగా ప్రేమించా . నువ్వు నా ప్రత్యేక ప్రేమదేశానివి. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ దీవిస్తూ ఉండాలి. '

3 Comentários:

chennakesavula said...

This article is heart touching and it will tell the child heart of MJ

konda kumar said...

After reading the above story,i understood michal jackson is not also a pop star, he is also just like common man.This article is very heart touching.Some rumours are spread on after his death just like he is gay,sadist,but we don't believe that type of rumours.we love michal forever and we never forget his words about india, thats great of India. we love india. Jai Hind

Unknown said...

Alas! M J could not get the essence of poetry and gr8 culture of india.




Jehara

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO