Friday, June 5, 2009

ఈశ్వరుడి మనసు , ఉద్దేశాలూ - 2

ఇవన్నీ ఈశ్వర ఉద్దేశాలుగా, మనసుగా చెలం చెబుతాడు రమణాశ్రమ జీవితకాలంలో . షౌ చేత ఈశ్వరుడు పలికిస్తున్నాడని చెలం విశ్వాసం. వీరేశలింగం గారికి ఉత్తరాల్లో ఈశ్వరుడి ఉద్దేశాలను చాలా స్పష్టంగా తేటపరుస్తున్నాడీ విధంగా...

*

అవును. ఏమైనా ఆయనకే వొదలండి. నవ్వుతో హాయిగా తిరగండి. ఆడుకోండి.
బైట ఆడుకునే బిడ్డ సందేహిస్తుందా, ఇంట్లో వున్న తల్లి వేళకి అన్నం పెడుతుందో లేదో అని.
ఆలస్యమయిందా ఆ రోజు పండగన్నమాట. పరమాన్నంతో వడలతో వస్తుంది భోజనం.

*

ఈశ్వరుడికి మానవుడిపైన, ముఖ్యం తన భక్తులపైన నిర్వాజ్యమైన కరుణే లేకపోతే, ఏ మానవుడూ ఆయన ప్రేమకి అర్హుడు కాదు. మీరొక్కరేకాదు. ఎవరూను, ఈశ్వరుడిలో విశ్వాసం ఎక్కువైనకొద్దీ, అన్ని దుర్గుణాలు పోతాయి. అరుణాచలాన్ని చూడగానే ఈశ్వరుడికింద అంత దగ్గరిగా గుర్తించగలగడం ఏదో పూర్వజన్మ విశేషం.

ఒకటి రాయండి.

గిరి ప్రదక్షిణంలో

మీ వెంబడి వొచ్చిన ఆయన పేరు,
ఆయన ఆకారం,
ఎంత దగ్గిరగా వర్ణించగలిగితే అంత
దగ్గిరగా వర్ణించి రాయండి.
మీరు ఆయన్ని ఎక్కడ కలుసుకున్నారు?
ఎక్కడ ఆయన మిమ్మల్ని వొదిలారు?


Seja o primeiro a comentar

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO