Monday, July 20, 2009

TV ఇంటర్వ్యూ ' స్వప్న .. ఇక్కడి వాళ్ళు ఇది ఒక కుక్క అని, దాని కాలుకు దెబ్బ తగలటం వల్ల కుంటుతుంది అని చెప్తున్నారు.'

మనం రోడ్ మీద వెళ్తూ ఉంటాం. ఒక కుక్క పిల్ల కాలు విరిగి కుంటుతుంటుంది. మనకి టైం ఉంటే ఆగి దానికి ఏమి కావాలో చూస్తాం, లేదు అంటే అయ్యో పాపం అని జాలి పడి వెళ్ళిపోతాం.

TV రిపోర్టర్ వెళ్తున్నాడు, వెంటనె TV ఆఫిస్ కి ఒక ఫొన్ వెళ్తుంది, వాడు కెమెరామెన్ ని పంపుతాడు.

ఇక మొదలు.

క్రిష్ణ ఆ కుక్క పరిస్తితి ఎలా ఉంది? ఎప్పటి నుంచి అక్కడ ఉంది?

ఈ కుక్క మార్నింగ్ నుంచి ఇక్కడే ఉంది, ఇప్పుడు కుంటుంతుంది......స్వప్న

ఆక్కడి వాళ్ళు ఏమన్నా చెబుతున్నారా?...క్రిష్ణ

స్వప్న...ఇక్కడి వాళ్ళు ఇది ఒక కుక్క అని, దాని కాలుకు దెబ్బ తగలటం వల్ల కుంటుతుంది అని చెప్తున్నారు. ఈ విధంగా గతం లో ఆ కుక్క ఈ area లొ ఇలా కుంటలేదని, ఇదే తాము మొదటి సారి చూడటం అని చెప్తున్నారు

కుంటుతున్న కుక్క స్పందన ఎలా ఉంది? .....క్రిష్ణ

కుక్క ప్రస్తుతం కుంటుతుంది స్వప్న. ఈ విధంగా కాలుకు దెబ్బ తగలటం కొత్త అనుకుంటా, అందుకే కుంటటం రాక ఇబ్బంది పడుతుంది. మాట్లాడించటానికి ప్రయత్నించిన అది సమాధానం చెప్పకుండా, మూలుగుతుంది.....స్వప్న

థాంక్ యు క్రిష్ణ, ఎప్పటికప్పుడు తాజా పరిస్థితి సమీక్షిస్తూ ఉండటానికి మీకు కాల్ చేస్తూ ఉంటాం.


ఇది గాయపడి కుంటుతున్న కుక్క స్థితి మీద మా క్రైం ప్రతినిధి క్రిష్ణ అందించిన వివరాలు.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్..
బ్రేక్ తర్వాత కుక్కలు-కుంటుడు అంశం పై చర్చింటానికి ప్రముఖ Doctor కుక్కుటేశ్వర రావ్ గారు మన Studio కి వస్తున్నారు..


బ్రేక్ తర్వాత..........


రజనికాంత్ : చెప్పండి కుక్కుటేశ్వర్ రావ్ గారు గతం లో మీరు ఎప్పుడైన ఇలా కుక్కలు కుంటటం చూసారా? ఒక వేళ చూస్తే ఏ జాతి కుక్కలు కుంటటము చుసి ఉంటారు.

కుక్కుటేశ్వర్ : ఈ విధంగా కుక్కలు కుంటటం ఇది మొదటి సారి కాదు. ఫ్రపంచవ్యాప్తం గా ఎన్నో జాతుల కుక్కలు, ఎన్నో సందర్భాల్లో ఇలా కుంటినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. కుంటటానికి జాతి తో సంబందం లేదు.

రజనికాంత్: అంటే కుక్కలు కుంటేటప్పుడు వాటికి ఏమన్నా బాధ ఉంటుందా? ఉంటే ఎటువంటి బాధ?

కుక్కుటెశ్వర్ : బాధలో రకాలు ఉండవండి. కుంటేటప్పుడు general గా దెబ్బ తలిగిన కాలు కి నొప్పి ఉంటుంది అని Dog's Medical Science లొ గట్టి ఆధారాలు ఉన్నాయి.


రజనికాంత్ : తాజా పరిస్థితి చెప్పేందుకు మా క్రైం ప్రతినిధి క్రిష్ణ టెలి ఫొన్ లొ సిద్దంగా ఉన్నారు...క్రిష్ణ చెప్పండి..ఆ కుక్క పరిస్థితి ఎలా ఉంది.

క్రిష్ణ : (చెవిలో ear piece పెట్టుకుని బిత్తర చూపులు చూస్తూ ఉంటాడు..)

క్రిష్ణ చెప్పండి..ఆ కుక్క ఫరిస్థితి ఎలా ఉంది?

రజిని ... కుక్క మూలుగుతుంది, ఇప్పుడే blue cross వాళ్ళు దానిని తీసుకువెళ్ళారు.


కుక్క కాలు కి దెబ్బ తగిలింది, దాని ఇతర శరీర భాగాలు ఎలా ఉన్నాయి?...క్రిష్ణ

రజిని, కుక్క కాలు కి మాత్రమే దెబ్బ తగిలింది. కాని ఈ కుక్క తోక వంకర గా ఉంది.

వంకర అంటే ఎలా ఉంది...క్రిష్ణ (ఇప్పుడు రజిని మొహం లో expressions ఇంకెక్కడా చూడలేము, శత్రువు టాంకర్ ని ద్వంసం చెయ్యటానికి wait చెస్తున్న soldier face లో తప్ప)


రజిని వంకరగా అంటిచుకుని ఉంది, నేను ఇప్పటికి దానిని straight చెయ్యటనికి try చెతున్నాను కాని అది చుట్టుకుపొతుంది. బహుశ కాలు కి దెబ్బ తగలటం వల్ల అని నా ఉద్దేశం.

థాంక్ యు క్రిష్ణ....కుక్కుటెశ్వర్ గారు, కాలు కి దెబ్బ తగలటం వల్ల తోక వంకర అయ్యి ఉంటుంది అని మా ప్రతినిధి క్రిష్ణ చెప్తున్నారు, దీని పై మీ స్పందన ఏంటి?

స్పందన అంటే ఏమి ఉంటుంది రా పుండxx వెధవ...కుక్క తోక కాలు కి దెబ్బ తగలటం వల్ల వంకర అయ్యేది ఏంటి ర ధేడ్ ది xxక్. ఏమి మనిషివి రా నువ్వు, ఇప్పటి వరకు నువ్వు రాసి ఇచ్చిన answers చదివాను, ఇంక నా వల్ల కాదు, నా టీ మరిగిపొతూ ఉంటుంది. బంగారం లాంటి మల్లయ్య అనే పేరు మార్చి కుక్కుటెశ్వర్ రావ్ అని మార్చి, షర్ట్, పాంట్ రెంట్ కి తెచ్చి నాకు ఇచ్చి డాక్టర్ లాగ act చెయ్యలా? ఇల act చేస్తె నా tea కొట్టు నుంచి ఎదురు గా ఉన్న మీ TV  office కి రోజు 100 tea లు ఆర్డెర్ ఇస్తారా. మనస్సాక్షి ఉందంట్ర వెధవ *్*్*్*.దొంగ నా &%%్**( గాలి న &$%్**.. మీ బతుకులు చెడ....)




Source: A mail from friend

8 Comentários:

Anonymous said...

How many time we have to read this again and again. If you do not have anything to write just keep quite, why to copy and paste.
already Billirao copy pasted it once and now you did it.

read this.

http://deeptidhaara.blogspot.com/2009/07/blog-post.html

విజయ్ రాజశేఖరుని said...

హ... హ... హా.... బాగా రాశారు.
క్రియేటివ్ కుర్రోడు మాధవ్ తన బ్లాగ్లో " బ్రేకింగ్ న్యూస్ " అనే టపా కూడా అచ్చం ఇలాగే రాశారు. వీలయితే చదవండి. :)

http://creativekurrodu.blogspot.com/2009/01/blog-post_29.html

Valluri Sudhakar said...

కధ అదిరింది.

నాగప్రసాద్ said...

మీకు మెయిల్ రాక ముందు, మొదట ఈ టపాను రాసింది ఈ బ్లాగులోనే. http://pappusreenu.blogspot.com/2009/02/blog-post_04.html

ఇప్పుడు దీన్ని ఎవరు రాశారో తెలిసింది కాబట్టి, Source from mail అని తీసేసి, పైనున్న బ్లాగు లింకు ఇవ్వండి సరిపోతుంది.

Anonymous said...

LOL. Amazing on how our TVs are turning out to be. Excellent post. Try forwarding this to that TV station guys.

Anonymous said...

సూపర్ గా ఉంది ఇంటర్వ్యూ.

Sridhar said...

Anduke munde ceppanu idi oka mail nunci vaccindi ani. Already cadivithe vodileyyocchu. cadavanivaalla kosame idi.

Anonymous said...

ఎవరెన్ని రకాలుగా తిట్టుతున్నా మేము మారము...కారణం మాకు కావలసింది డబ్బు...యాడ్స్ ద్వారా మాకు డబ్బు వస్తుంటే ...చూసే వాళ్ళు ధైర్యం చేసి మా ప్రతినిధులని ఏమీ పీకలేరు...మాకు సామాన్య మానవులంటే చులకన...మెరుగైన సమాజం నిజంగా కావంటే సామాన్యులదరూ మాలాగే తయ్యారవ్వాలీ.....

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO