Friday, June 5, 2009

ఈశ్వరుడి మనసు , ఉద్దేశాలూ - 1

ఇవన్నీ ఈశ్వర ఉద్దేశాలుగా, మనసుగా చెలం చెబుతాడు రమణాశ్రమ జీవితకాలంలో . షౌ చేత ఈశ్వరుడు పలికిస్తున్నాడని చెలం విశ్వాసం. వీరేశలింగం గారికి ఉత్తరాల్లో ఈశ్వరుడి ఉద్దేశాలను చాలా స్పష్టంగా తేటపరుస్తున్నాడీ విధంగా...

అవును. యీ ఆధ్యాత్మిక సాధనలో ఇట్లాంటి పరీక్షలు ఎన్నో జరుగుతాయి. ఇక్కడికి వొచ్చిందాకా ఎందుకు? మీకు అక్కడే సాధన ప్రారంభమయి జరుగుతోందన్నమాట. ఈశ్వరుడి ఆజ్ఞకి ఎదురు తిరగడం మానవ స్వభావం. మీరన్నట్టు ఈశ్వర సహాయం లేనిది, మన మనసునీ దాని కోరికల్ని జయించలేము. ప్రశ్నలు వేసినందుకు చిరాకు రాదు.

కాని స్పష్టంగా తెలుస్తున్న దాన్ని కప్పిపుచ్చుకొని చూడ్డం ఇష్టంలేక ఏవో ముళ్ళు పెట్టి, ఆ కోర్కెల్ని నేనుగాని, ఈశ్వరుడుగాని, సమర్థించాలని ఎట్లాగో అంగీకారాన్ని సంపాయించాలని చూస్తుంది. అసలు ఈశ్వరుణ్ణి ప్రశ్నించనఖ్ఖర్లేదుకూడానూ. ప్రతి నిమిషం ఆయనే నడిపిస్తున్నారని, నిర్ణయిస్తున్నారని తెలిసిన కొద్దీ ప్రశ్నలు వెయ్యము.

ప్రతి సందేహాన్ని తీర్చుకోండి.
ఈశ్వరుణ్ణీ అడగండి ఏమి చెయ్యాలని.
కాని ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకోండి.

Seja o primeiro a comentar

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO