అంతర్ముఖి
వాళ్లెందుకట్లా
నన్నింకా యింకా లోతుగా
సమాధి చెయ్యలేదు.
... నాకు అదొక అశాంతి నిద్ర
నేను సగమే చచ్చానేమో
నా సమాధి పైనుంచి
అడుగుల చప్పుడు వినిపిస్తోంది
నన్నింకా.. యింకా లోలోతుగా
సమాధి చెయ్యమన్న నా కేక
గగనాన్ని తాకుతోంది.
అప్పుడిక అనంత విశ్రాంతి నిండిన నిద్రలోకి జారుకుంటాను...
Posted by , at Saturday, March 21, 2009
Labels: కవిత్వం, మృత్యుగీతాలు
Related Articles:©THE iNSIDER. Template by Dicas Blogger.
2 Comentários:
మీ చావు కవిత చచ్చేంత బాగుంది...కానీ మరీ చిన్నగా ఉంది. ఇలాంటివి మరిన్ని వ్రాయండి.
నవీన్ గారి అభిప్రాయమే నాది కూడా. మీరింకా కొంచం సమయం దానిమీద పెట్టివుండి వుంటే ఈ కవిత మరింత అద్భుతంగా తయారయ్యివుండేది. ఏమైనా మీ కవితలో భావం చాలా బాగావుంది.
Post a Comment