మరణశయ్య
నా మరణశయ్య పక్కనుండి నువ్వెళుతున్నప్పుడు
వో పుష్ప గుఛ్చాన్ని వుంచుతావేమోనని ఆరాటపడ్డాను.
నీ స్పర్శతో పునరుజ్జీవనడవుతాననే
ఆశతో నీ వైపు దీనంగా చూశాను.
నీ కన్నీటి స్పర్శ నన్ను అమరుణ్ణి చేస్తుందని
నీ కంటి నుండి వొక్క చుక్కైనా రాలుతుందేమోనని
నిస్తేజంగా నీ వైపు చూశాను.
జాలిలేని నీ హృదయాన్ని యింకా యింకా కోరుకోవడం
మృత్యువుని నా దగ్గిరనుంచి యింకా యింకా దూరం చేస్తోంది.
నాకు వూపిరాడకుండా వుంది యీ సగం చావుతో.
నాకింక పొద్దు పొడవని గాఢమైన నిద్ర ఎపుడు లభిస్తుంది?!
9 Comentários:
చాల విషాదకరంగా ఉంది. అది ఎలాగూ వస్తుందని తెలిసినా, మరణం గురించి చదవాలన్న వినాలన్నా చాలా భయంగా ఉంటుంది :(
Chaala bagundi.... maraninchaka kuda prema kosam eduruchustama... emo?
Excellent !
చాల బాగుంది ప్రేమ గురుంచి బాగా వివరిస్తారని తెలుసుకునాన్ను చనిపోయిన తర్వాత కూడా ప్రేమ కోసం చూడడం బాగుంది రాస్తూ వుందండి
it's very very good how it possible to write like this . i feel jealous of your writing.
Its eally good..Happy to find this blog.. expecting more..
గుండెని పిండేసింది!
eppudo nenu raasina kavitha gurthochindandi,
bhagha raasaaru meeru, keep writing.
Good one
Nijamaina prema eppudu gelustundi
Atuvanti premaki maranam vundadani nenu bhavistunnanu
Post a Comment