Tuesday, August 18, 2009

మగధీరకు అసలు ముందు అనుకున్న కథ ఇదీ !

హీరో నేరుగా తన తండ్రి దగ్గిరకు వెళ్ళి 'గత జన్మలో నేనెవర్ని?' అని అడుగుతాడు. 'గాడిదవి, అందుకే ఈ జన్మలో నా మీద పడి మేస్తున్నావు ' చెబుతాడా తండ్రి. 'అయితే గత జన్మ రహస్యం తెలుసుకునే వరకూ ఇంటికి తిరిగి రాను ' అంటో వెళ్ళిపోతాడు.

పునర్జన్మ నిబంధనల ప్రకారం యెవరి చెయ్యి తగిలితే షాక్ కొడుతుందో ఆమె తన హీరోయిన్. ఈ క్లూ ఆధారంగా బస్టాపు ల్లోనూ, లోకల్ రైళ్లలోనూ అమ్మాయుల మధ్య తచ్చాడసాగాడు. షాక్ తగల్లేదు కానీ గూబలు పగిలాయి. హీరోయిన్ ను వెతకలేనప్పుడు కనీసం విలన్ నైనా వెతుక్కోవాలి. నేరుగా వెళ్లి బోరాను కలిశాడు. తాను పట్టిన జలమల్లా కల్లుగా మారాలనే దీక్షతో సికింద్రాబాద్ లోని ఒక రైలు బోగీలో అతను తపస్సు చేస్తున్నాడు. రెండు ముంతల కల్లు తాగిన తరువాత కళ్లు తెరిచాడు. విషయమంతా విని 'పగిలిన కల్లు ముంత అతుక్కోదు ' అంటాడు.

హీరో ఇంకో ముంత కల్లు అందిస్తాడు. 'నువ్వు విలన్ ను కలిసినప్పుడు పక్షులు గాల్లోకి ఎగురుతాయి ' అంటే
హీరో 'అర్థమైంది, మిగతా విషయాలు నాకు తెలుసు ' అంటో వెళ్లిపోతాడు.

హైదారాబాద్ వీధుల్లో హీరో వెతుకుండగా మూసీనది వొడ్డున విలన్ ఎదురవుతాడు. పక్షులు గాల్లోకి లేవడంతో అతన్ని గుర్తిస్తాడు హీరో.

'పక్షులు గాల్లోకి ఎందుకెగిరాయో తెలుసా?' అంటో హీరో విలన్ ను అడుగుతాడు.
'రెక్కలున్నాయి కాబట్టి ' అంటాడు విలన్.
'సూర్యుడెందుకు నల్లబడ్డాడో తెలుసా?'
'సూర్యుడేం ఖర్మ, ఇక్కడి కాలుష్యానికి వాడి తాతయినా నల్లబడాల్సిందే '
'నువ్వు మండే అగ్ని గోళంలా కనిపిస్తున్నావ్'
'నోట్లో చుట్టవుంది, కనబడట్లేదా?'
'నీ మరదలెక్కడ?'
'వోస్! దీనికింత బిల్డప్ ఎందుకు, నేరుగా పాయింటుకొచ్చేయొచ్చుగా, రా , చూపిస్తా ' అంటో గోల్నాకలోని ఇరుకు మురికి సందులన్నీ తిప్పి ఒక ఇంటి ముందు ఆగి 'ఇందుమతీ ! ' అని పిలుస్తాడు.

'అరె! పేరు కూడా కరెక్టుగా మ్యాచెయ్యిందే! ' అని హీరో సంబరపడతాడు. ఇందుమతి బయటికి రాగానే ఆత్రంగా ఆమెకు చేతివేళ్లు తగిలించాడు. నో షాకింగ్.

'నీ మొహం, షాకయినా షేకయినా మనం అనుకోగానే రావు ' అని ఆమె ఇంట్లోకి వెళ్లి రెండే నిముషాల్లో బయటకొచ్చింది. ఆమె చెయ్యు పట్టుకోగానే హీరోకి చెవుల్లోంచి , ముక్కులోంచి పొగలొచ్చి కాళ్లూ చేతులు కొట్టుకుంటూ కిందపడ్డాడు. 'ఏమైంది వాడికి , బ్రేక్ డాన్సులా షేకయ్యిపోతున్నాడు.' అని విలన్ కంగారు పడతాడు.

'కరెంటు వైర్లు చేతిలో పెడితే, ఎవడైనా డాన్సింగ్ చెయ్యాల్సిందే ' అంది ఇందుమతి. హీరో స్పృహలోకి వచ్చిన తరువాత 'అంతా గుర్తుకొచ్చింది ' అని కెవ్వున అరుస్తాడు. ఫ్లాష్ బ్యాక్ వినక తప్పలేదు.

'నువ్వు హర్యానాలోని రాంఘడ్ యువరాణివి. అక్కడ అందరూ తెలుగే మాట్లాడతారు. నా పేరు పాలభైరవుడు. ప్రతిరోజూ గుర్రంపై కోటకు పాలు తెచ్చేవాణ్ని. కల్తీలేని పాలను పోస్తున్న నాలో కల్తీలేని ప్రేమ ఉంటుందని నువ్వు నన్ను ప్రేమించావు. కానీ మీ మేనమామ అడ్డు తగిలాడు. దీంతో మహరాజు మాకో పోటీ పెట్టాడు. రాజస్థాన్ ఎడారి నుంచి చుక్క పాలు కిందపడకుండా ఎవరు తీసుకొస్తారో వాడే నీకు మొగుడన్నాడు. మీ మేనమామకు మధ్యలో దాహమేసి పాలను తాగేశాడు. నేను మాత్రం పోటీలో తెలిచాను ' చెబుతాడు హీరో. '

నేను మధ్యలో దాహమేసి పాలను తాగలేదు. దీన్ని చేసుకోవాల్సి వస్తుందనే భయంతో తాగాను ' అంటాడు విలన్. '
మరి షేర్ ఖాన్ ఎక్కడ?'
'ఆగాగు, షేర్ ఖాన్ కూడా వస్తున్నాడు సీన్ లోకి. మన ప్రేమ పండుతున్న సమయంలో షేర్ ఖాన్ దండేత్తి వస్తాడు. అప్పుడు పూజలు చేసుకోవడానికి నువ్వు ఒక కొండ మీదకెళ్లావు. నీకు టైం కి పాలూ పెరుగూ అందించడానికి నేనూ వెంటే వున్నాను. అప్పుడు షేర్ ఖాన్ వచ్చి నాకో అగ్ని పరీక్ష పెడతాడు. వంద బర్రెలను ఇచ్చి కొండ మీద ఒక్కటి కూడా తప్పిపోకుండా మేపుకు రమ్మన్నాడు. నేను ఆ బర్రెలను మేపుతూ మేపుతూ ముసలి వాడిని అయిపోయాను. ఆ జన్మలో నువ్వేమయ్యావో తెలియదు.'

'పోన్లే , ఇప్పటికైనా కలుసుకున్నాం, అంతే చాలు ' అంటుంది ఇందుమతి.
' అదేంటి , విలన్ తో ఫైంటింగ్ మిగిలుంది కదా '
' నీకంత శ్రమ అఖ్కర్లేదు. ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయితో నేనేం సుఖపడతాను ? ఆ షాక్, క్రాక్ రెండూ నీకే సొంతం ' అంటో విలన్ కథలోంచి తప్పుకుంటాడు.

ఇక మన హీరో తన హీరోయిన్ తో ఇంటికెళతాడు.
'ఎవరు మీరు ' తండ్రి అడిగితే
'నాన్నా! నేనే , నీ కొడుకుని '

'నేనూ మీలాగే గత జన్మ జ్ఙాపకాల్లో ఉన్నాను. మీరెవరో గుర్తుకురావడం లేదు '
అని తండ్రి కర్ర తీసుకుంటాడు.

*

[Thanks to Sri G. R. Maharshi for his excellent narration. This was published in Sunday Sakshi. I reproduced for those who might missed this article]

14 Comentários:

శరత్ కాలమ్ said...

:)

Anonymous said...

::))--

రవి said...

:)))

Anonymous said...

మీరో పేరడీ సినిమా తియ్యండి ఈ కధతో మగ DEER అని.

sriram velamuri said...

very good

sriram velamuri said...

ఇడ్లీ కన్నా చట్నీ బాగుంది .ఈ కధే బాగుంది

Bhaskar said...

KEKALO KEKALU....

Anonymous said...

Really funny

bunny said...

well said

keep it up

Kiran said...

ప్రతి వారం మహర్షి గారి లైట్ రీడింగ్ చదువుతా..
ఆయన శైలి నాకు బాగా నచ్చింది..

Anonymous said...

I am a regular reader of Maharshi's column. He is simply amazing. Strange that I missed this excellent article. Thanks a lot.

Balaji said...

:::::))))))))

Anonymous said...

Aithe Ok...! Oru katravalli kando.

Manthena said...

అద్భుతం . పిచ్చి పిచ్చి స్క్రిప్ట్స్ తో జనాలకి పిచ్చెక్కిస్తున్న సినీ జనాలకి మంచి చురక. అప్పుడప్పుడు ఇటువంటి మంచి చురకలు పదాలండి గుడ్ .కీప్ ఇట్ అప్. రాజు

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO