Monday, December 22, 2008

భగత్ సింగ్ ప్రిసన్ (PRISON) నోట్స్ - Page Wise


గత్ సింగ్ అంటే బాంబులు విసిరినవాడు - కత్తులు దూసినవాడు - రక్తం చూసినవాడని.అందుకే ఉరికంబానికి గురయ్యాడన్న ప్రచారం చేశారు. పరాయి పాలకులు పోయారు. స్వాతంత్ర్యం సాధించుకున్నాం. ఇన్నేళ్ళు గడిచాయి. అయినా స్వతంత్ర భారత చరిత్రలో అతని కన్యాయం జరిగింది. 'టెర్రరిస్టు ' గా ముద్ర వేసింది.2 4 సంవత్ర్సరాల జీవితంలో, 10 సంవత్సరాల రాజకీయ అనుభవంలో భగత్ సింగ్ ఎలా పరివర్తన చెందాడో గమనిస్తే - అతని టెర్రరిజం భావాలు స్వల్పకాలమే. అధ్యయనం, అనుభవం-అతన్ని రాజకీయవేత్తగా సిద్దాంతకర్తగా తీర్చిదిద్దాయి.డిల్లీ హైకోర్టు విచారణలో భగత్ సింగ్


'విప్లవమంటే రక్తపాతం కాదు. వ్యక్తిగత ద్వేషం కాదు. లేక బాంబు-పిస్తోలు కాదు. విప్లవమంటే యూనాటి వ్యవస్థను, దాన్ని కాపాడే శాసనాలను, వాటి ఆధారంగా జరిగే అక్రమాలను అరికట్టడం . సంపద సృష్టించే శ్రామికుని రక్తం పీల్చివేయబడుతుందీనాడు. అతని ప్రాథమిక హక్కులు హరించబడుతున్నాయ్. పంటలు పండించే రైతు సకుటుంబంగా పస్తుల పాలవుతున్నాడు. బట్టలు నేసి, గుట్టలుగా వేసే చేనేత కార్మికుల బిడ్డల వొంటి మీద బట్ట కరువైపోయింది. పెద్దపెద్ద మేడలు కట్టే కార్మికులు మురికివాడల్లో మ్రగ్గుతున్నారు ఎందుకు ? దీనికంతటికీ మూలం ఒకదేశం మరొక దేశాన్ని, ఒక మనిషి మరొక మనిషిని దోచుకోవడమే. పెట్టుబడి దారీ విధానమే యిందుకు మూలం. అది అంతం కావాలని, దానికోసమే తమ పోరాటమ'ని స్పష్టం చేశాడు.

ది విప్లవం ద్వారా సాధ్యమవుతుందని కార్మిక-కర్షక రాజ్యమేర్పడుతుందన్నాడు. పెట్టుబడిదారుల వర్గ దోపిడీ నిండి ప్రజలకు విముక్తి లభిస్తుందన్నాడు. యుద్దాల మారణ హోమం నుండి ప్రపంచ ప్రజానీకాన్ని విముక్తి చేసి, సమసమాజాన్ని స్థాపిస్తుంది. అదే తమ సిద్దాంతమని వివరించాడు. న్యాయమైన హక్కుల సాధనకోసం హింసా పద్దతి అనుసరిస్తే నైతికంగా అది సమర్థనీయమే. హింసను పూర్తిగా తొలగించాలని మీరు భావిస్తే అది మీ వెర్రితనమే అవుతుంది. గురుగోంద్ సింగ్, శివాజీ, కమల్ పాషా, రిజాఖాన్, వాషింగ్టన్, గారీబాల్డీ, లఫాయటే, లెనిన్ మొదలైన మహానాయకులు మాకు ఆదర్శం. వారి ఆదర్శాలు మాకు ప్రేరణ. ఆ ఆశయాల సాధంకోసం మా నూతన పోరాటం ప్రారంభమయ్యిందన్నాడు.



ప్రభుత్వం భగత్ సింగ్ రాజకీయదాడిని తట్టుకోలేకపోయింది. అతని రాజకీయ వాగ్యుద్దం ప్రజల్లో కలుగుతున్న ప్రభావాన్ని అంచనా వేసుకుంది. భగత్ సింగ్ ను కోర్టుకు హాజరుపరచకుండా, చిత్రహింసలకు గురి చేసి జైలుగోడల మధ్యనే బంధించింది. జైలును కూడా పోరాట వేదిక చేశాడు. నాలుగు గోడల మధ్యనే శాంతియుత సమరం సాగించాడు. నిరాహార దీక్షతో ప్రభుత్వాన్ని హడలెత్తించాడు. ఆ వార్త దేశంలోని జైళ్ళన్నింటికి ప్రాకి, నిరాహారదీక్షల సమరంగా మారింది. విప్లవకారులు తుపాకులు పేల్చడం , బాంబులు విసరడమేగాదు, శాంతియుత పోరాటంలోను విప్లవదీక్షను రుజువు చేశారు.



దేశమంతా భగత్ సింగ్ ప్రాణాన్ని కాపాడాలని ఘోషిస్తుంటే
' నా ప్రాణం అంత విలువైనది కాదు. దేశం, దేశ స్వాతంత్ర్యం ముఖ్యం. ప్రాణాన్నివ్వడం ద్వారానే దేశానికి మేలు చేయగలుగుతాను. జాతిని నిద్రలేపగలుగుతాను-ఇన్ క్విలాబ్ నినాదం దేశమంతా ప్రతిధ్వనింప చేయగలుగుతానని ప్రతినబూని సామ్రాజ్య వాదుల ఉరికొయ్యలపై వొరిగిపోయిన వీరుడు భగత్ సింగ్ తను జైళ్ళో వుండగా రాసుకున్న నోట్స్ Page wise ఇకనుండి చదవండి.

4 Comentários:

Anonymous said...

మంచి ప్రయత్నం.

నేస్తం said...

నాకు తెలియకుండానే చేతులెత్తి నమస్కరించాను భగత్ సింగ్ ని చూసి .. అంతటి గొప్ప మహానుభవుని గురించి రాసినందుకు నెనర్లు

Anonymous said...

bhagat singh gurinchi inka ento telusukovalani atrutaga undi.. oka sainikudu chanipote chese lanchanalu kuda ayanaki jaragaledani alochiste chala badhaga untundi..NO LAST INTERVIEW WITH RELATIONS??? emi prove cheddamankunnaru british vallu? desam gurinchi paritapinche ivanni lesamatramu......

Unknown said...

really good work ,great
and itis very nonsense to call him as terrorist

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO